Amazon 'Great Republic Day Sale' 2026 –
Dates and Offer Details Here
అమెజాన్ 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' 2026 – తేదీలు మరియు ఆఫర్ ల వివరాలు ఇవే
==================
అమెజాన్
కొత్త ఏడాదిలో తొలి సేల్ ప్రారంభం అయ్యింది. గ్రేట్ రిపబ్లిక్ సేల్ 2026 జనవరి 16 నుంచి ప్రారంభం
అవ్వనుంది. అమెజాన్ సేల్ లో భాగంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో కొనుగోళ్లు, ఈఎంఐ కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
సేల్ లో భాగంగా
స్మార్ట్ఫోన్లు, స్మార్ట్వచ్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్లు, పీసీలు,
గేమింగ్ కన్సోల్, స్మార్ట్ గ్లాసెస్, వాషింగ్ మెషిన్లు, ప్రొజెక్టర్లు, స్మార్ట్ టీవీలపై ఆఫర్లు ఉండనున్నాయి. మరోవైపు ఫ్లిప్కార్ట్ జనవరి 17న సేల్ను ప్రారంభించనుంది. ఫ్లిప్కార్ట్ ప్లస్, బ్లాక్
మెంబర్లకు 24 గంటల ముందే యాక్సెస్ లభించనుంది. అంటే ఈ పండగ
సీజన్లో రెండు అతిపెద్ద ఇ-కామర్స్ సంస్థల మధ్య మరోసారి పోటీ నెలకొననుంది.
ఈ సేల్లో
భాగంగా మొబైల్ ఫోన్లు, ట్యాబ్ లు, టీవీలు, టీడబ్ల్యూఎస్
హెడ్సెట్స్ పై ఆఫర్లు లభించనున్నాయి. తాజాగా మొబైళ్లపై ఆఫర్ వివరాలను అమెజాన్
రివీల్ చేసింది. వన్ప్లస్ 15, వన్ప్లస్ నార్డ్ 5, శాంసంగ్ గెలాక్సీ ఏ55, ఐకూ 15 ఫోన్లు ఈ జాబితాలో ఉన్నాయి. వన్ ప్లస్ 15.. 12జీబీ+256జీబీ వేరియంట్
గతేడాది నవంబర్లో రూ.72,999కు లాంచ్ అయ్యింది.
ఈ సేల్లో కార్డ్ ఆఫర్ కలుపుకొని రూ. 68,999కే విక్రయిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వన్స్ 15ఆర్ను రూ.44,999కు కొనుగోలు
చేయొచ్చని తెలిపింది. వన్ప్లస్ నార్డ్ 5 రూ.30,999కు లభిస్తుంది.
ఐకూ బ్రాండ్
నుంచి ఫ్లాగ్లిప్ ఫోన్ అయిన ఐకూ 15.. ఈ సేల్లో రూ.65,999కి లభిస్తుంది. దీన్ని గతేడాది నవంబర్లో రూ.72,999కి కంపెనీ లాంచ్ చేసింది. ఐకూ నియో 10 మోడల్ను రూ.33,999కి కొనుగోలు చేయొచ్చు. వీటితో పాటు ఐకు నియో 10R (రూ.24,999),
ఐకూ జడ్ 10 (రూ.20,499), ఐకూ జడ్ 10ఆర్ (రూ.18,499), ఐకూ జడ్ 10 ఎక్స్ (రూ.13,499), ఐకూ జడ్ 10 లైట్ (రూ.9,999)ను తక్కువ ధరకే దక్కించుకోవచ్చని ఐకూ 'ఎక్స్'లో పేర్కొంది.
అమెజాన్ సేల్లో శాంసంగ్ ఏ55 మోడల్ రూ.23,999కి లభించనుంది. శాంసంగ్ ఎం17 5జీ రూ.12,999కి ఆఫర్లో కొనుగోలు చేయొచ్చు. రియల్మీ
నార్ట్ల్లో లైట్ లీ, రెడ్మీ ఏ4 5జీ, లావా బోల్డ్ ఎన్1 5జీ ఫోన్లపై ఆఫర్లు ఉన్నాయి. మరిన్ని ఆఫర్ల వివరాలు త్వరలో
వెల్లడి కానున్నాయి.
==================
==================




0 Komentar