Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TG: Dearness Allowance (DA) Hike for Government Employees – Details Here

 

TG: Dearness Allowance (DA) Hike for Government Employees – Details Here

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు – ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

==================

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగకి శుభవార్త చెప్పింది. డీఏను 3.64 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన డీఏ 2024 జులై 1 నుంచి వర్తించనుంది. జనవరి నెల వేతనంతో పెరిగిన డీఏను ప్రభుత్వం ఫిబ్రవరి 1న చెల్లించనుంది. 2023 జులై 1 నుంచి గతేడాది డిసెంబర్ 31 వరకు ఉన్న డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనుంది.

2026 ఏప్రిల్ 30లోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు డీఏ బకాయిలను 30 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 2004 సెప్టెంబర్ 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగం పొంది సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిల్లో 10 శాతం ప్రాన్ ఖాతాకు జమ చేయనుంది. మిగతా 90 శాతం బకాయిలను 2026 ఫిబ్రవరి 1 నుంచి 30 సమాన వాయిదాల్లో చెల్లించనుంది.

పింఛన్ దారులకు పెరిగిన డీఆర్ (డియర్నెస్ రిలీఫ్) మొత్తం ఫిబ్రవరి 1న చెల్లించనుంది. అంతకుముందు ఉన్న డీఆర్ ఎరియర్స్ ను ఫిబ్రవరి 1 నుంచి 30 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం వెల్లడించింది.

==================

DOWNLOAD G.O.3 (PENSIONERS)

==================

Previous
Next Post »
0 Komentar

Google Tags