Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NABARD Recruitment 2026: Apply for 162 Development Assistant Posts – Details Here

 

NABARD Recruitment 2026: Apply for 162 Development Assistant Posts – Details Here

నాబార్డ్ లో 162 డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టులు – జీతభత్యాలు: నెలకు రూ. 46,500   

====================

భారత ప్రభుత్వ అగ్రస్థాయి ఆర్థిక సంస్థ అయిన నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవెలప్మెంట్ (నాబార్డ్)లో.. 162 డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ప్రాంతీయ కార్యాలయాలలో ఖాళీల భర్తీ కోసం డెవలప్మెంట్ అసిస్టెం & డెవలప్మెంట్ అసిస్టెంట్ (హిందీ) పోస్టుల నియామకాలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తులు చేసుకోవాలి.

డెవెలప్మెంట్ అసిస్టెంట్- 159 పోస్టులు

డెవెలప్మెంట్ అసిస్టెంట్ (హిందీ) - 03 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 162

అర్హత: డెవెలప్మెంట్ అసిస్టెంట్ కు ఏదైనా విభాగంలో 50శాతం మార్కులతో డిగ్రీ ఉత్తర్ణత, డెవెలప్మెంట్ అసిస్టెంట్ (హిందీ) పోస్టుకు హిందీ, ఇంగ్లీష్ బ్జెక్టులతో డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి, ఇంగ్లీష్- హిందీ అనువాదం చేయగలగాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.

జీతభత్యాలు: నెలకు రూ.46,500.

వయోపరిమితి: 01.01.2026 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష(ఆన్లైన్), లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఇంటిమేషన్ చార్జెస్ రూ.150; ఇతరులకు దరఖాస్తు ఫీజు + ఇంటిమేషన్ చార్జెస్ తో రూ.550 .

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

ముఖ్యమైన తేదీలు:  

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 17/01/2026.

దరఖాస్తులకు చివరి తేదీ: 03/02/2026.

====================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

====================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags