SAI Recruitment
2026: Apply for 323 Assistant Coach Posts – Details Here
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లో 323 అసిస్టెంట్
కోచ్ పోస్టులు - జీతం: నెలకు రూ.35,400 - రూ.1,12,400.
===================
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) రెగ్యులర్
ప్రాతిపదికన వివిధ క్రీడా విభాగాల్లో ఖాళీగా ఉన్న 323 అసిస్టెంట్
కోచ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల
అభ్యర్థులు 2026 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
క్రీడా విభాగాలు: స్విమ్మింగ్, అథ్లెటిక్స్, సైక్లింగ్, జిమ్నాక్టిక్స్, రెజ్లింగ్, జూడో, రోయింగ్, షూటింగ్, బాక్సింగ్, ఫెన్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, ఆర్చరి, టేబుల్ టెన్నీస్, బ్యాడ్మింటన్, టెన్నీస్, బాస్కెట్ బాల్, వాలీబాల్, ఫీల్డ్ హాకీ, ఫుట్బాల్, హ్యాండ్బాల్, కబడ్డీ, ఖోఖో, సపక్ తక్రా..
అసిస్టెంట్ కోచ్: 323 ఖాళీలు
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, ఎంఎస్సీ(
స్పోర్ట్స్ కోచింగ్), పీజీ డిప్లొమా, లేదా దానికి
సమానమైన అర్హతత, లేదా ఒలింపిక్స్, ఆసియా
క్రీడలు/ వరల్డ్ ఛాంపియన్షితో పాటు సర్టిఫికేట్ కోర్సులో శిక్షణ పొంది ఉండాలి.
వయోపరిమితి: 2026 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి 30 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు
ఉంటుంది.
జీతం: నెలకు రూ.35,400 - రూ.1,12,400 .
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ, మహిళా, ఎక్ససర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.2,000.
ఎంపిక: రాత పరీక్ష (సీబీటీ) ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 01/02/2026
ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 15/02/2026
===================
===================


0 Komentar