RRB Recruitment 2026: Notification for 22000+
Group D Level-1 Posts – Details Here
రైల్వే
రిక్రూట్మెంట్ బోర్డు లో 22,000 గ్రూప్-డి లెవల్-1 పోస్టులకు నోటిఫికేషన్ – వివరాలు ఇవే
===================
భారత
ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే
రిక్రూట్మెంట్ బోర్డు (RRB) దేశ వ్యాప్తంగా
అన్ని రైల్వే జోన్లలో మొత్తం 22,000 గ్రూప్-డి ఖాళీలను
భర్తీ చేస్తోంది. ఈ మేరకు లెవల్-1 పోస్టులకు
సంబంధించి సంక్షిప్త ఉద్యోగ ప్రకటనను (CEN No.09/2025) జారీ చేసింది. ఎంప్లాయిమెంట్ న్యూస్ లో విడుదులైన ప్రకటన వివరాల ప్రకారం జనవరి
21 నుంచి దరఖాస్తులు ప్రారంభం కావాల్సింది ఉండగా తాజాగా
దానిని 31నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆర్ఆర్బి
ప్రకటించింది. మార్చి 3వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం
కల్పించింది.
RRB
రీజియన్లు: అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్ పూర్, కోల్కతా, మాల్దా, ముంబయి, పట్నా, ప్రయాగ్జ్, రాంచీ, సికింద్రాబాద్.
ప్రకటన
వివరాలు:
లెవల్-1 గ్రూప్-డి: 22,000 ఖాళీలు (సుమారుగా)
పోస్టులు:
పాయింట్స్మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్
ఆపరేషన్స్ మొదలైనవి.
అర్హత: పదో
తరగతి,
సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక
ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01-01-2026 నాటికి 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్సీ/
ఓబీసీ/ పీహెచ్ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది. ప్రారంభ వేతన: నెలకు రూ.18,000.
ఎంపిక
ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్
ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్
విడుదల తేదీ: 31-01-2026.
ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 31-01-2026.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 02-03-2026.
గమనిక:
పోస్టుల వారీ ఖాళీలు, విద్యార్హత, ఎంపిక విధానం, దరఖాస్తు
ఫీజు సిలబస్ తదితర వివరాలను RRB త్వరలో విడుదల
చేయనుంది.
===================
===================

0 Komentar