Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

March 1, 2026: New Rules and Changes Effect in March 2026

 

March 1, 2026: New Rules and Changes Effect in March 2026

మార్చి 1, 2026 నుండి అమలులోకి రానున్న కొత్త నియమాలు & మార్పులు ఇవే!

====================

ఈ ఏడాది (2026) మార్చి 1 నుంచి కొన్ని మార్పులు రాబోతున్నాయి. సిమ్ బైండింగ్, యూపీఐకి సంబంధించిన రూల్స్ ఈ జాబితాలో ఉన్నాయి.

1. వాట్సప్ vs సిమ్:

వాట్సప్, టెలిగ్రామ్, సిగ్నల్, అరట్టయి వంటి కమ్యూనికేషన్ యాప్ లకు సిమ్ కార్డు బైండింగ్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. మార్చి 1 నుంచి ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఫోన్లో సిమ్ లేకపోయినా లేదా సిమ్ తొలగించినా యాప్ సేవలు ఆటోమేటిక్ గా ఆగిపోతాయి. ఆయా యాప్లను వెబ్ బ్రౌజర్లో ఉపయోగిస్తే ప్రతి 6 గంటలకు ఒకసారి లాగౌట్ అవుతుంది. సైబర్ మోసాలను అరికట్టే ఉద్దేశంతో ఈ రూల్స్ తీసుకొచ్చింది.

2. యూటీఎస్ సేవలు నిలిపివేత:

జనరల్ టికెట్లు, ప్లాట్ఫామ్ టికెట్ల బుకింగ్ కోసం రైల్వే శాఖ గతంలో తీసుకొచ్చిన యూటీఎస్ యాప్ మార్చి 1 నుంచి నిలిచిపోనుంది. ఈ సేవలన్నీ రైల్వేశాఖ కొత్తగా తీసుకొచ్చిన రైల్వైన్ (RailOne APP) యాప్ లో లభ్యమవుతాయి. యూటీఎస్ ఆర్-వాలెట్లోని నగదు ఉంటే రైల్వన్ యాపనకు బదిలీ అవుతుంది.

3. యూపీఐకి బయోమెట్రిక్ (UPI):

యూపీఐ చెల్లింపులు మరింత సురక్షితం కానున్నాయి. పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపేటప్పుడు పిన్ తో పాటు బ్యాంకులు అదనంగా బయోమెట్రిక్ లేదా ఇతర ఆథరైజేషన్ ను అడగనున్నాయి. దీంతో మోసాలను అరికట్టొచ్చు.

4. 1600 సిరీస్:

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ వినియోగదారులకు చేసే ఫోన్ కాల్స్ '1600 సిరీస్' నంబరును వినియోగించాలని ట్రాయ్ స్పష్టంచేసింది. బ్యాంకులు ఇప్పటికే దీన్ని అమలు చేస్తున్నాయి. మార్చి 1 నుంచి ఎన్బీఎఫ్సీలు, మార్చి 15 నుంచి స్టాక్ బ్రోకర్ల నుంచి వచ్చే కాల్స్ కూడా ఈ సిరీస్ నుంచే రానున్నాయి. బ్యాంకుల పేరిట సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాలను అరికట్టేందుకు ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది.

====================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags