నీట్ (యూజీ)
- 2026:
పూర్తి వివరాలు ఇవే
=====================
UPDATE
15-05-2026
NEET-UG
2026: నీట్ (యూజీ) పరీక్ష కొత్త
తేదీ ఇదే
రద్దయిన నీట్ యూజీ 2026 పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. జూన్ 21న, ఆదివారం ఈ పరీక్ష జరగనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం వెల్లడించింది. ఈ మేరకు ఎన్టీఏ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పరీక్ష కి సంబంధించి అధికారిక మార్గాల్లో వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని విద్యార్థులను ఎన్టీఏ (NTA) కోరింది. హాల్ టికెట్ మరియు ఇతరత్రా వివరాలను త్వరలోనే వెల్లడించనుంది.
📢 NEET (UG) 2026 — Examination Date Announced
— National Testing Agency (@NTA_Exams) May 15, 2026
The National Testing Agency, with the approval of the Government of India, has scheduled the re-examination of NEET (UG) 2026 on Sunday, 21 June 2026.
Candidates and parents are requested to rely only on the official channels of NTA.…
=====================
UPDATE
12-05-2026
NEET-UG 2026: నీట్ (యూజీ) పరీక్ష రద్దు - వివరాలు ఇవే
నీట్ యూజీ-2026 కు సంబంధించిన ప్రశ్నాపత్రం రాజస్థాన్ లో లీకైనట్లు
వచ్చిన వార్తలు పెనుదుమారం రేపాయి. ఈ నేపథ్యంలో జాతీయ పరీక్ష సంస్థ (ఎన్టీఏ) కీలక
నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా మే 3న జరిగిన నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు
ప్రకటించింది. త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను వెల్లడిస్తామని తెలిపింది.
కొత్త పరీక్ష కోసం విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్
చేసుకోవాల్సిన అవసరం లేదని, పరీక్ష ఫీజు
చెల్లించనక్కర్లేదని తెలిపింది. పరీక్ష తేదీలను నిర్ణయించిన తర్వాత మళ్లీ అడ్మిట్
కార్డులు విడుదల చేస్తామని పేర్కొంది.
=====================
UPDATE 07-05-2026
NEET-UG 2026: ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదల
=====================
National Testing Agency will conduct the
National Eligibility cum Entrance Test [NEET (UG)] – 2026 on 03 May 2026
(Sunday) from 02:00 P.M. to 05:00 P.M. (Indian Standard Time).
=====================
NEET-UG 2026: అడ్మిట్ కార్డులు విడుదల
పరీక్ష తేదీ:
03/05/2026
=====================
=====================


0 Komentar