Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Ola Electric Launches S1 X+ 5.2 kWh Scooter With 320 km Range – Details Here

 

Ola Electric Launches S1 X+ 5.2 kWh Scooter With 320 km Range – Details Here

ఓలా ఎలక్ట్రిక్ కొత్త వెర్షన్ - సింగిల్ ఛార్జింగ్ తో  320 కిలోమీటర్లు – ధర & ఫీచర్ల వివరాలు ఇవే

===================

ఓలా ఎలక్ట్రిక్ కొత్త స్కూటర్ ను మార్కెట్ లోకి లాంచ్ చేసింది. సొంతంగా అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్ తో తయారు చేసిన ఎస్1 ఎక్స్+ 5.2 kWh వేరియంట్ ను (Ola s1 x+) సోమవారం విడుదల చేసింది. దీని ధరను రూ. 1,29,999గా నిర్ణయించింది. ఇన్ హౌస్ లో రూపుదిద్దుకున్న సెల్ టెక్నాలజీ సాయంతో తయారు చేసిన స్కూటర్ కావడంతో అందుబాటు ధరలో తేవడం సాధ్యమైందని ఓలా ఎలక్ట్రిక్ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఏప్రిల్ 15 వరకు ప్రారంభ ధర కింద రూ.1.29 లక్షలకు విక్రయించనున్నట్లు ఓలా తెలిపింది. ఇందులో 11kW మిడ్ డ్రైవ్ మోటార్ ను అమర్చినట్లు వెల్లడించింది. సింగిల్ ఛార్జింగ్తో 320 కిలోమీటర్లు (IDC రేంజ్) ప్రయాణించొచ్చని పేర్కొంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 125 కిలోమీటర్లు. బ్రేకింగ్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తూ బ్రేక్ బై వైర్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ సదుపాయంతో తీసుకొచ్చినట్లు ఓలా వెల్లడించింది.

ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ప్రో స్కూటర్లతో పాటు రోడ్లర్ విద్యుత్ మోటార్ సైకిళ్లను విక్రయిస్తోంది. ఎస్1 థర్డ్ జనరేషన్లో ఎస్1 ప్రో+ (5.2kWh, 4kWh), ఎస్ 1ప్రో (4 kWh, 3kWh) పేరుతో ప్రీమియం స్కూటర్లను విక్రయిస్తోంది. మాస్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఎస్1 ఎక్స్+ (4kWh), ఎస్ 1 ఎక్స్ (2, 3, 4 kWh) విక్రయిస్తోంది. రోడ్లస్టర్ ఎక్స్+ను 4.5kWh, 9.1 kWh కాన్ఫిగరేషన్ తోనూ, రోడ్డర్ ఎక్స్ ను 2.5, 3.5, 4.5 kWh బ్యాటరీ సామర్థ్యంతోనూ విక్రయిస్తోంది. ఎస్1 ఎక్స్+ 5.2 kWh ఈ శ్రేణిలో కొత్తగా చేరింది.

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags