Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TG TET JUNE 2026: All the Details Here

 

TG TET JUNE 2026: All the Details Here

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2026 – పూర్తి వివరాలు ఇవే  

===================

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. జూన్ 15 నుంచి 30 వరకు సీబీటీ విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 9 నుంచి అభ్యర్థులు అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జులై 28 నుంచి 31 మధ్య ఫలితాలను ప్రకటిస్తారు.

1) పేపర్-I: (1 నుంచి 5వ తరగతి) బోధించేవారికి:

అర్హత: కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్/సీనియర్ సెకండరీలో డీఈఐఈడీ/ బీఈఐఈడీ/ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్లో ఉత్తీర్ణత ఉండాలి.

2) పేపర్-II: (4 నుంచి 8వ తరగతి) బోధించేవారికి:

అర్హత: బీఏ/బీఎస్సీ/బీకామ్, బీఈడీ/ బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్)లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

భాషా ఉపాధ్యాయుల కోసం సంబంధిత భాషలో గ్రాడ్యుయేషన్/ సాహిత్యం/ ఓరియెంటల్ లాంగ్వేజ్ + ఎల్పీటీ/ బీఈడీలో మెథడాలజీ.

ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్: బీఈ/ బీటెక్ + బీఈడీలో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: వయస్సుకు పరిమితి లేదు (అర్హత పరీక్ష మాత్రమే).

దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు: 

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 15/04/2026

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30/04/2026

అడ్మిట్ కార్డులు విడుదల తేదీ: 09/06/2026

పరీక్షల తేదీలు: 15-06-2026 నుండి 30-06-2026 వరకు

ఫలితాలు విడుదల తేదీ: 28/07/2026 - 31/07/2026

===================

WEBSITE

SCHOOL EDUCATION WEBSITE

===================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags