Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Cabinet Meeting Highlights - 30/04/2026

 

AP Cabinet Meeting Highlights - 30/04/2026

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే - 30/04/2026

====================

Cabinet Decisions - Press Briefing by Hon'ble Minister for Finance, Planning, Commercial Taxes & Legislative Affairs, Sri. Payyavula Keshav at Publicity Cell, Block-4, AP Secretariat on 30-04-2026 | LIVE

ఏపీ క్యాబినెట్ మీటింగ్ గురించి ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసార వివరాలు ఇవే

YouTube Link:

https://www.youtube.com/watch?v=xG5R9x7RQ-M

====================

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విలేకరులకు వివరించారు.

కేబినెట్ నిర్ణయాలు ఇవే:

1. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో రూ.1,208 కోట్లతో ట్విన్ ఆఫీస్ టవర్ల నిర్మాణ ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించింది.

2. దిల్లీలో రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా రూ.124.5 కోట్లతో 11 ఎకరాల్లో నూతన ఏపీ భవన్ నిర్మించాలని నిర్ణయించింది.

3. డిజైన్, భవన నిర్మాణ బాధ్యతలు నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్బీసీసీ)కు అప్పగించాలన్న ప్రతిపాదనలు ఆమోదించింది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కేంద్ర రక్షణ సంస్థ డీఆర్డీవో చేపట్టే రక్షణ పరిశ్రమ కోసం 600 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది.

3. అమరావతిలో కృష్ణా నది కుడి గట్టు వద్ద వరద నిరోధక నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు రూ. 443.26 కోట్లతో మూడు ప్యాకేజీలుగా పనులు. కొత్త టెండర్లు పిలిచేందుకు ఏపీసీఎల్ సీఎండీకి అనుమతి.

4. అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయం, హెడ్ డీల కార్యాలయ భవనాలకు గ్లాస్ క్లాడింగ్, క్రౌన్, అట్రియం, కెనోపీ స్కైలైట్, కాలమ్ క్లాడింగ్, పీవీ ప్యానెల్, బీఎంయూ పనుల కోసం రూ.2,540 కోట్ల పనులకు ఆమోదం. పనులు చేపట్టేందుకు మూడు ప్యాకేజీల కింద టెండర్లు పిలవడానికి ఏజీఐసీఎల్ ఎండీకి అనుమతి.

5. రాజధానిలో శాసనసభ భవనానికి స్పైర్, పార్కింగ్ రింగ్, రూఫ్, పాలవాగు మీద అనుసంధాన వంతెనలు తదితర నిర్మాణాల కోసం రూ.798 కోట్లకు పరిపాలన అనుమతులు.

6. అమరావతి జోన్-11 పరిధిలో ఉండవల్లిలో భూసమీకరణ పథకంలో చేపడుతున్న లేఔట్లలో రహదారులు, కాలువలు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల,

విద్యుత్తు వ్యవస్థ తదితర మౌలిక వసతుల కల్పనకు రూ.580 కోట్లకు పరిపాలన అనుమతులు. సీఆర్డీఏ నిధుల నుంచి ఈ పనుల్ని చేయనున్నారు.

7. సీఆర్డీఏ పరిధిలోని ఎన్ 101 జంక్షన్ నుంచి ఎన్13- 1 జంక్షన్ వరకూ 220 కేవీ ఈ హెచ్పీ లైన్ బ్యాలెన్స్ పనుల్ని యూజీ కేబుల్స్ ద్వారా రీరూటింగ్ చేయడానికి సవరించిన అంచనా రూ.1,180.54 కోట్లకు పాలనామోదం.

8. ఆర్-5 జోన్లో గతంలో రెవెన్యూ శాఖకు ఇచ్చిన భూముల్ని రద్దు చేసి, వెనక్కు

తీసుకునేందుకు సీఆర్డీఏకు అనుమతి.

9. భూ సమీకరణలో రైతుల కోరిక మేరకు యాన్యుటీ మొత్తం పెంపు, రుణ మాఫీ కటాఫ్ తేదీ పెంపు తదితర నిర్ణయాలకు ఆమోదం.

10. రాజధాని ప్రాంతంలో సెబీకి 1.5 ఎకరాలు, స్వామి నారాయణ్ గురుకులం, అగ్నిమాపకశాఖ, డీఏవీ పబ్లిక్ స్కూల్లకు సీఆర్డీఏ చేసిన భూకేటాయింపులకు ఆమోదం.

11. సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్ర న్యాయ విభాగాల్లో 21 కొత్త పోస్టుల మంజూరు. ఒక కోర్టు చీఫ్ మేనేజర్, ఐదు సీనియర్ కోర్టు మేనేజర్లు, 15 కోర్టు మేనేజర్ పోస్టుల కల్పన.

12. భోగరాజు పట్టాభి స్మారక భవనానికి 1.5 ఎకరాల కేటాయింపు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో డా. భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణం, సేవా కార్యక్రమాల నిర్వహణ కోసం 1.5 ఎకరాల ప్రభుత్వ భూమిని సంబంధిత ట్రస్టుకు రూ.37.56 కోట్లకు కేటాయించాలనే ప్రతిపాదనకు ఆమోదం

13. ఏపీ ప్రత్యేక రక్షణ దళంలో 23 ఏళ్లుగా పదోన్నతులకు నోచని 385 మందికి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి.

14. రామాయపట్నం పోర్టులో డ్రెడ్జింగ్ ద్వారా తీసిన మట్టిని పారవేసే ప్రదేశం మార్చడంతో వచ్చిన రూ.354 కోట్ల అదనపు ఖర్చుకు ఆమోదం.

15. ఎన్సీడీసీ నుంచి రూ.1,800 కోట్ల రుణం తీసుకునేందుకు మార్క్ ఫెడ్క గ్యారంటీ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం.

16. అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో మ్యుటేషన్ ఛార్జీలు ఒకేలా ఉండేలా మున్సిపల్ చట్టాల సవరణ ముసాయిదాకు ఆమోదం.

17. పోలవరం నిర్వాసితులకు ఆర్థిక సాయం పెంపు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు గతంలో ప్రభుత్వమే కాలనీ అభివృద్ధి చేసి, గృహ నిర్మాణం చేపట్టేది. కానీ వన్ టైం సెటిల్మెంట్ ఎంచుకున్నవారికి గృహ నిర్మాణానికి రూ.2.85 లక్షల నుంచి 3.57 లక్షలకు పెంచాలని నిర్ణయం. వేరో చోట ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారికి స్థలం విలువ రూ. లక్ష నుంచి రూ. రెండు లక్షల పెంపునకు అనుమతి.

18. శ్రీసత్యసాయి జిల్లాలో హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ఫేజ్-2 పరిధిలో పుంగనూరు బ్రాంచ్ కాలువను సిమెంట్ కాంక్రీట్ లైనింగ్తో ఆధునికీకరించేందుకు రూ.309 కోట్ల పనులకు అనుమతి.

19. జాతీయ క్రీడా పాఠశాల నిర్మాణానికి పదెకరాలు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కుర్రకాల్వలో అంతర్జాతీయ క్రీడా పాఠశాల నిర్మాణం కోసం సన్రైజ్ ఎడ్యుకేషనల్ ఇనీషియేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఎకరా రూ.1.12 కోట్ల చొప్పున 10.10 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపునకు ఆమోదం.

20. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు కోసం 22.74 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఐఐసీకి రూ.3.18 కోట్ల చెల్లింపుపై కేటాయించేందుకు అనుమతి.

21. అసెప్టిక్ ప్యాకింగ్ యూనిట్ అప్ డేషన్, పండ్లు, కూరగాయల నుంచి పల్ప్ తీయడానికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చిత్తూరు జిల్లా యాదమరి మండలం మాజర కొత్తపల్లిలో ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్కు 13.17 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకరా రూ. లక్షన్నరకు ఇచ్చేందుకు ఆమోదం.

22. అనంతపురం జిల్లా గుత్తిలో ఎంఐజీ లేఅవుట్ల అభివృద్ధి కోసం 11.82 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకరా రూ.12.60 లక్షల చొప్పున అనంతపురం- హిందూపురం పట్టణాభివృద్ధి సంస్థకు కేటాయింపునకు ఆమోదం.

23. శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, అనకాపల్లి జిల్లాలోని పూడిమడక, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో రూ.1,586.69 కోట్లతో మూడు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి సవరించిన అంచనాలకు పరిపాలనా అనుమతులు. పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ ను సమీప పారిశ్రామిక క్లస్టర్లకు ఉపయోగపడేలా కార్గో హ్యాండ్లింగ్ సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నారు. దీని వల్ల రహదారి రద్దీ తగ్గుతుంది.

24. ఏపీ పవర్ కోఆర్డినేషన్/ డిస్కంలకు రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న రూ.7 వేల కోట్ల ఎంటీఎల్ రుణాలకు షరతులతో ప్రభుత్వ హామీ పొడిగింపు.

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags