SBI Recruitment 2026: Apply for 9,124
Junior Associate Posts – Details Here
ఎస్బీఐలో 9,124 జూనియర్ అసోసియేట్ పోస్టులు – జీతం: నెలకు రూ.24,050 - రూ.64,480.
===================
స్టేట్
బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ కేడర్ లో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) ఉద్యోగాల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి
దరఖాస్తులు కోరుతోంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా వివిధ రాష్ట్రాలు/యూటీలలో మొత్తం 9,124 ఖాళీలను (7,680 రెగ్యులర్ ఖాళీలు + 1,444 బ్యాక్లాగ్ ఖాళీలు) ఎస్బీఐ భర్తీ చేయనుంది.
ప్రిలిమినరీ, మెయిన్స్, స్థానిక భాష
ప్రావీణ్య పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 31వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
జూనియర్
అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్): 9,124
(రెగ్యులర్: 7,680 + బ్యాక్ లాగ్: 1,444)
అర్హత:
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి
డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం/ సెమిస్టర్ విద్యార్థులు
తాత్కాలికంగా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ 31.12.2026 నాటికి లేదా అంతకు ముందు గ్రాడ్యుయేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 2026 ఏప్రిల్ 1వ తేదీ నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్లు
ఉండాలి. 02-04-1998
& 01-04-2006 మధ్య అభ్యర్థులు జన్మించి ఉండాలి.
ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 నుంచి 15 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు
రూ.24,050
- రూ.64,480 .
దరఖాస్తు
ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎన్ఎస్, డీఎక్స్ప్రెస్
అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు
ప్రక్రియ: ఆన్లైన్ ఆధారంగా.
ముఖ్యమైన
తేదీలు:
దరఖాస్తు
ప్రారంభ తేదీ: 11-08-2026
దరఖాస్తు
స్వీకరణకు చివరి తేదీ: 31-08-2026
===================
===================


0 Komentar