Bank Of Baroda Recruitment 2026: Apply
for 206 Specialist Officer Posts – Details Here
బ్యాంక్ ఆఫ్
బరోడాలో 206 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు - జీతభత్యాలు: నెలకు రూ.48,480 నుండి రూ.1,20,940 వరకు
===================
బ్యాంక్ ఆఫ్
బరోడా (BOB)
వివిధ విభాగాల్లో 206 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి
రెగ్యులర్ ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదల చేసింది. డిజిటల్ బ్యాంకింగ్, ఫెసిలిటీ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్
సెక్యూరిటీ, సెక్యూరిటీ, ఎంటర్ప్రైజ్ డేటా మేనేజ్మెంట్, కార్పొరేట్ అకౌంట్స్ & టాక్సేషన్ ప్లానింగ్ వంటి విభాగాల్లో మేనేజర్, సీనియర్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్, టెక్నికల్ మేనేజర్ నియామకాలు భర్తీ చేయనున్నారు. అర్హత గల
అభ్యర్థులు ఆగస్టు 26 వరకు దరఖాస్తులు
చేసుకోవాలి.
విభాగాల
వారీగా పోస్టులు
1. డిజిటల్
బ్యాంకింగ్: 19
2. ఫెసిలిటీ
మేనేజ్మెంట్: 88
3.ఇన్ఫర్మేషన్
సెక్యూరిటీ: 16
4.
సెక్యూరిటీ: 54
5.
ఎంటర్ప్రైజ్ డేటా మేనేజ్మెంట్ ఆఫీస్: 14
6.
కార్పొరేట్ అకౌంట్స్ & టాక్సేషన్
ప్లానింగ్: 15
మొత్తం
పోస్టుల సంఖ్య: 206.
పోస్టులు:
మేనేజర్,
సీనియర్ మేనేజర్, ప్రొడక్ట్
మేనేజర్,
టెక్నికల్ మేనేజర్, టెక్నికల్
సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్.
అర్హత:
పోస్టును బట్టి గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్, బీసీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా సంబంధిత అర్హతలు ఉండాలి. అదనంగా
ఆయా పోస్టులకు 2 నుంచి 10 సంవత్సరాల వరకు సంబంధిత అనుభవం తప్పనిసరి.
జీతభత్యాలు:
నెలకు రూ.48,480 నుండి రూ.1,20,940 వరకు
వయోపరిమితి:
01.08.2026 నాటికి 23 నుంచి 43 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక
విధానం: దరఖాస్తుల పరిశీలన, ఆన్లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్
డిస్కషన్,
ఇంటర్వ్యూ, డాక్యుమెంట్
వెరిఫికేషన్ ఆధారంగా.
దరఖాస్తు
ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.850; ఎస్సీ/ ఎస్టీ, పీడబ్ల్యూడీ/మహిళలు, ఎక్ససర్విస్మెన్
అభ్యర్థులకు రూ.175.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 06-08-2026.
ఆన్లైన్
దరఖాస్తులకు చివరి తేదీ: 26-08-2026.
===================
===================

0 Komentar