Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 12th December Information

School Assembly 12th December Information

నేటి ప్రాముఖ్యత
అస్సాం రైఫిల్స్ స్థాపన దినోత్సవం.
చరిత్రలో ఈ రోజు
➥యువరాజ్ సింగ్, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడి జననం
➥షావుకారు జానకి, రజినీకాంత్ & నూతన్ ప్రసాద్ వంటి ప్రజాదరణ నటుల పుట్టిన రోజు.
➥ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు, ఆంధ్రాసాహిత్యాన్ని ప్రజ్వలింప జేసిన ఘనుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (సి పి బ్రౌన్‌) వర్థంతి.
నేటి అంశము- సైన్సు (భౌతిక,రసాయనిక శాస్త్రం)
 హెలికాప్టర్ ఎలా ఎగురుతుంది?
హెలికాప్టర్ కు 'రోటార్' అనే పరికరం బిగించి ఉంటుంది. దీనికి  ఫ్యాన్ లాగా రెక్కలు ఉంటాయి.  ఈ    రోటర్ ను ఆన్ చేయడంతోనే రెక్కలు అత్యంత వేగంతో తిరుగుతాయి. హెలికాప్టర్ పైకి లేచి గాలిలోకి ఎగురుతుంది. మీద నుండే స్పిన్నింగ్  రోటార్ హెలికాప్టర్ ను  పైకి లేపుతుంది. రోటార్ కు  ఉండే బ్లేడ్స్  నిజానికి రెక్కల్లాంటివి. వీటికి వంపు ఉంటుంది. రోటార్ రెక్కలు గిర్రున తిరిగినప్పుడు వంపు వల్ల గాలి వేగంగా కిందికి ప్రవహిస్తుంది. దీంతో రోటార్ పై భాగంలో అల్పపీడనం ఏర్పడుతుంది. హెలికాప్టర్ పైకి లేస్తుంది. రెక్కలు కోణాన్ని మార్చుకుంటూ హెలికాప్టర్  ను   నిట్టనిలువుగా గాల్లోకి, గాల్లోంచి నిట్టనిలువుగా కిందికి ప్రయాణించేట్లు చేయడం సాధ్యపడుతుంది. ప్రయాణ దిశను కూడా మార్చుకునే వీలుంటుంది.
మంచి మాట
మనిషి తన చేతలతోనే గొప్పవాడవుతాడు, జన్మతః కాదు - చాణక్యుడు
వార్తలలోని ముఖ్యాంశాలు 
➥ఉత్కంఠ రేపిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రజలు జై కొట్టారు. టిఆర్ఎస్ కు 88, కాంగ్రెస్ కు 19, ఎంఐఎంకు 7, తెలుగుదేశం పార్టీకి 2, భాజపాకు 1 ఇతరులు 2 చొప్పున సీట్లను గెలుపొందారు. అయితే సిద్దిపేట అభ్యర్థి తన్నీరు హరీశ్ రావు ప్రత్యర్థిపై 1,18,699 ఓట్ల మెజారిటీతో గెలిచి అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో కొత్త రికార్డు సృష్టించారు. వరుసగా ఆరు సార్లు అసెంబ్లీకి ఎన్నికై డబుల్ హ్యాట్రిక్ ఘనతను అత్యంత పిన్న వయసులో 46 ఏళ్లకే అందుకున్న వ్యక్తి గా హరీష్ రావు గారు చరిత్ర సృష్టించారు.
 ➥చత్తీస్ గఢ్ లో మొత్తం 90 సెగ్మెంట్ల గాను కాంగ్రెస్ 68, బిజెపి 16, బీఎస్పీ 2 ఇతరులు 4 సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానున్నది.
 ➥రాజస్థాన్ లోని మొత్తం 200 ( అయితే ఎన్నికల జరిగింది 119 సిగ్నల్స్ లోనె) కాంగ్రెస్ 99, బిజెపి 73, స్వతంత్రులు 13, ఇతరులు 14 సెగ్మెంట్లు కైవసం చేసుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానున్నది.
 ➥మధ్యప్రదేశ్ లో మొత్తం సెగ్మెంట్లు 230 లో కాంగ్రెస్ 113, బీజేపీ 109, బీఎస్పీ 2, ఇతరులు 6 చేసుకున్నారు. ఎవరికీ పూర్తి అధికారం రాకపోవడంతో హంగ్ ఏర్పడినది.
 ➥మిజోరంలోని మొత్తం 40 సెగ్మెంట్లను ఎంఎన్ఎఫ్ (మిజో నేషనల్ ఫ్రంట్) 26, కాంగ్రెస్ 5, బీజేపీ 1 ఇతరులు 8 సీట్లు కైవసం చేసుకున్నారు. ఇక్కడ ఎంఎన్ఎఫ్ అధికారం చేపట్టనున్నది.
 ➥ఇస్రో ఈ నెల 5న ఫ్రెంచి గయానా కౌరు అంతరిక్ష కేంద్రం నుండి ఏరియన్-5VA246 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ప్రయోగించిన జీశాట్-11 ఉపగ్రహం భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూ స్థిర కక్ష్య (జియో ఆర్బిట్) లోకి సోమవారం విజయవంతంగా ప్రవేశించిందని ఇస్రో ప్రకటించింది. ఈ ఉపగ్రహం ప్రయోగంతో 14 గిగాబైట్స్ ఇంటర్నెట్ ఫ్రీక్వెన్సీ అందుబాటులోకి రావడమే కాకుండా 16 జీబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ అందుబాటులోకి వస్తుంది.
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా శక్తికాంత దాస్ నియమితులయ్యారు. ఆయన మాజీ ఫైనాన్స్ సెక్రటరీ, ప్రస్తుత ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు. ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్ పదవికి రాజీనామా చేయడంతో కేంద్ర ప్రభుత్వం శక్తికాంత దాస్‌ను ఆ పదవిలో నియమించింది. ఆర్బీఐ 25వ గవర్నర్‌గా దాస్ బాధ్యతలు చేపట్టబోతున్నారు.

School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,december month school assembly day wise,december 2018 school assembly,december 2018 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు12th december 2018 assembly, 12th december 2018 assembly,news of the day history,news of the day highlights,12th dec 2018 assembly, dec 12th assembly, dec 12th historical events, 12th december 2018 assembly, december 12th assembly, december 12th historical events,school related today assembly,school related today news, school related december 12th information, school related december month information
Previous
Next Post »
0 Komentar