Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 19th December Information

School Assembly 19th December Information
నేటి ప్రాముఖ్యత 
గోవా విముక్తి దినోత్సవం.
చరిత్రలో ఈ రోజు
1952 వ సం. లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటించాడు.
1961 వ సం. లో భారత సైనిక దళాలు పోర్చుగీసు పాలన నుండి, గోవాను విముక్తి చేసాయి.
1978 వ సం. లో ఇందిరా గాంధీని లోక్‌సభ నుండి బహిష్కరించి, అప్పటి సమావేశాలు ముగిసే వరకు ఆమెకు జైలుశిక్ష విధించారు.
ప్రముఖ గాంధేయవాది అయిన  నిర్మలా దేశ్ పాండే 1929 న జన్మించారు.
హైదరాబాదు మాజీ మేయరు, రచయిత, పాత్రికేయడు మరియు విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశీలి అయిన కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ మరణించిన రోజు.
నేటి అంశము-సైన్సు (భౌతిక,రసాయనిక శాస్త్రం)
అగ్నిపర్వతం ఎలా పేలుతుంది.
అగ్నిపర్వతం బద్దలై పైకి ఎగజిమ్మే మంటలు మంటలు కావు. అత్యధిక ఉష్ణంతో వెలువడే ఉండే  ఖనిజ ద్రవాలు.  వీటితో పాటు బూడిద, రాళ్లు  ఎగిసిపడతాయి.భూమిలో లోపల ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ వేడికి  అక్కడి రాళ్లు కరిగిపోతాయి. ఈ ద్రవాన్ని మాగ్మా అంటారు. భూ కేంద్రకం పైపొర( క్రస్ట్ ) పల్చగా ఉన్న చోట నుండి మాగ్మా పైకి   తన్నుకొస్తుంది. అలాగే, భూభాగాలు, ఒకదానితో మరొకటి కలిసేచోట ఉండే సన్నటి గాడి వద్ద నుంచి ఇది ఉపరితలానికి తన్నుకొస్తుంది. ఈ ఒత్తిడికి ఉపరితల ప్రాంతపు  రాళ్లు కూడా ముక్కలు ముక్కలుగా చిద్రమై మాగ్మా తో కలిసి ఉవ్వెత్తున ఎగిసిపడతాయి. దీన్నే అగ్నిపర్వతం పేలింది అంటారు. బూడిద, రాతి ముక్కలు కలిసి భూమ్మీదకు ఎగసిపడిన మాగ్మాను లావా అంటారు.


మంచిమాట/సుభాషితం
వేమన సుభాషితం
ఆత్మ శుద్దిలేని యాచార మదియేల
భాండ సుద్దిలేని పాకమేల
చిత్తశుద్దిలేని శివపూజ లేలరా
విశ్వదాభి రామ వినుర వేమ
భావం - మనసు నిర్మలంగా లేకుండా దుర్బుద్దితో చేసే ఆచారం ఎందుకు ? వంట పాత్ర శుభ్రంగా లేని వంట ఎందుకు ? అపనమ్మకంతో దురాలోచనతో చేసే శివ పూజ ఎందుకు ? (ఇవన్నీ వ్యర్ధం అని వేమన భావన)
వార్తలలోని ముఖ్యాంశాలు 
పెథాయ్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర చలిగాలులు వీస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వీస్తున్న చలిగాలులతో తెలుగు రాష్ట్రాలలో 34 మంది మృతి చెందారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. దానికి బదులుగా ప్రత్యేక ప్యాకేజీని ఇప్పటికే ప్రకటించినట్లు కేంద్రం తెలిపింది.
నేడు జీఎస్‌ఎల్‌వీ - ఎఫ్ 11 శాటిలైట్‌ను సతిష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు. సాయంత్రం 4:10 గంటలకు జీశాట్ - 7ఏ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లనుంది.
వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ని మరింత సరళతరం చేయబోతున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకేతాలు పంపించారు. మొత్తం వస్తువుల్లో 99 శాతం వస్తువులను 18 శాతం పన్ను పరిథిలోకి తేవాలని తన ప్రభుత్వం కోరుకుంటున్నట్లు తెలిపారు. 
శని గ్రహం చుట్టూ ఉండే వలయాలు మాయమైపోతున్నాయని నాసా సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శని గ్రహం అయస్కాంత క్షేత్ర ప్రభావంతో ఈ వలయాలు క్రమంగా మంచు అణువులతో కూడిన వర్షంలాగా కురుస్తూ కరిగిపోతున్నాయని సైంటిస్టులు వెల్లడించారు. ఇదిలాగే కొనసాగితే వచ్చే పది కోట్ల సంవత్సరాల్లో అసలు రింగులు కనిపించకుండాపోతాయని వాళ్లు అంచనా వేశారు.
ఆస్ట్రేలియా సిరీస్‌లో పెర్త్‌ మ్యాచ్‌లో 146 పరుగులతో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. చివరి రోజు 287 పరుగుల లక్ష్య చేధనలో రెండో ఇన్నింగ్స్‌లో 140 పరుగులకే కుప్పకూలింది. ఈ ఓటమితో టీమిండియా లెజెండరీ కెప్టెన్ ఎంఏకే పటౌడీ పేరిట మాత్రమే ఇన్నాళ్లూ ఉన్న ఓ చెత్త రికార్డును కోహ్లి సొంతం చేసుకున్నాడు.
➥ ఐపీఎల్ 2019 సీజన్ కోసం జరుగుతున్న ఆటగాళ్ల వేలంలో తమిళనాడు కుర్రాడు వరుణ్‌ చక్రవర్తి ని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ అత్యధికం గా రూ.8.40 కోట్లతో దక్కించుకుంది. కాకినాడకు చెందిన హనుమ విహారి రూ. 2 కోట్లు పలికాడు.


School Assembly 19th December Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,December month school assembly day wise,December 2018 school assembly,December 2018 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 19th December 2018 assembly, 19th December 2018 assembly,news of the day history,news of the day highlights,19th dec 2018 assembly, dec 19th assembly, dec 19th historical events, 19th December 2018 assembly, december 19th assembly, december 19th historical events,school related today assembly,school related today news, school related december 19th information, school related december month information
Previous
Next Post »
0 Komentar