Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 27th December Information


School Assembly 27th December Information

చరిత్రలో ఈరోజు
1911వ సం. జనగణమనను మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభల్లో పాడారు.
సోవియట్ జిమ్నాస్ట్  ఒలింపిక్ క్రీడలలో 18 పతకాలను సాధించిన లారిసా లాటినినా పుట్టిన రోజు.
➥1571: జోహాన్స్ కెప్లర్, ప్రఖ్యాత జర్మన్ అంతరిక్ష పరిశోధకుడు పుట్టిన రోజు.
➥1822: లూయీ పాశ్చర్, ప్రఖ్యాత ఫ్రెంచి జీవశాస్త్రవేత్త పుట్టిన రోజు.
మహిళల విద్యాభివృద్ధికి కృషిచేసిన వ్యక్తి కాకర్ల శ్రీరాములు మరణించిన రోజు.
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో మరణించిన రోజు.
నేటి అంశము:
రుచి తెలుసుకోవడానికి నాలుక ఒక్కటే సరిపోతుందా..?
నాలుకపై పాపిల్లే అనే రుచిని తెలిపే మొగ్గలు ఉంటాయి. వీటిని టేస్ట్ బడ్స్ అంటారు. మనం ఏదన్న నోట్లో వేసుకోగానే దాని రుచిని ఇవి చెప్పేస్తాయి. ప్రాధమిక రుచులు తీపి, పులుపు, ఉప్పదనం, చేదు మాత్రమే. మిగిలినవన్నీ ఇవి కలిసి పోవడం వల్ల వచ్చే రుచులే. నాలుక మీద ఒక్కో భాగంలో ఉండే రుచి మొగ్గలు ఒక్కో రుచిని గుర్తిస్తాయి. నోట్ల పడకముందే పదార్ధాల వాసన బట్టి రుచి తెలుసుకోగలం. వాసన చూడకుండా ఏవైనా తింటే అంత రుచిగా అనిపించదు. కాబట్టి ముక్కు కూడా రుచులు తెలుసుకోవడానికి కొంత ఉపయోగపడుతుంది.

సుభాషితం:
రువు లతిరసఫలభార గురుత గాంచు
నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘు
డుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత
జగతి నుపకర్తలకు నిది సహజగుణము...!
భావం - బాగా పండ్లున్న చెట్లు ఆ భారంతో వినమ్రంగా వంగి ఉంటాయి. నీటితో నిండిన మేఘాలు ఆ బరువుతో ఆకాశంలో మరీ పైపైన కాకుండా కిందుగా సంచరిస్తుంటాయి. ఉత్తములు కూడా అంతే, సంపదవల్ల వారికి గర్వం రాదు. నమ్రత, వినయంగా ఉండటం, గర్వం లేకపోవడం.... లాంటివన్నీ పరోపకారం చేసేవారికి సహజంగానే ఉంటాయని పై పద్యం యొక్క తాత్పర్యం.
వార్తలలోని ముఖ్యాంశాలు
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనకు కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జనవరి 1 నుంచి హైకోర్టు కార్యకలాపాలు వేర్వేరుగా ప్రారంభం కానున్నాయి. తెలంగాణకు 10 మంది, ఆంధ్రప్రదేశ్‌కు 16 మంది న్యాయమూర్తులను కేటాయిస్తూ కేంద్ర న్యాయ శాఖ బుధవారం సాయంత్రం గెజిట్‌ను విడుదల చేసింది.
దేశంలో పలు చోట్ల విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళికలు రచిస్తున్న ఉగ్రవాదుల కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లో పలు చోట్ల ఏకకాలంలో తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో ఇస్లామిక్‌ స్టేట్‌కు చెందిన హర్కత్‌ ఉల్‌ హర్బ్‌ ఇ ఇస్లాంముఠా సభ్యులను అరెస్టు చేశారు. రాజకీయ, ఇతర ప్రముఖులే లక్ష్యంగా దాడులు చేసేందుకు వీరు కుట్ర పన్నుతున్నట్లు ఎన్‌ఐఏ పేర్కొన్నది.
కడప జిల్లాలో నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. 3 వేల ఎకరాల్లో నిర్మించనున్న ఈ పరిశ్రమకు 20 వేల కోట్లు వ్యయం కానున్నట్లు ప్రాథమిక అంచనా.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి సంబంధించి 16 అంశాలను పరిష్కరించాలని , ఏపీ పునర్విభజన చట్టంలోనిఅంశాలతోపాటు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల్సిన నిధులు, ఇతర అంశాలపై కేసీఆర్‌ ప్రధానితో చర్చించారు.
రష్యా అభివృద్ధి చేసిన అత్యాధునిక హైపర్‌సోనిక్‌ క్షిపణి వ్యవస్థ అవన్‌గార్డ్‌ తుది పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచదేశాల వద్ద ఉన్న క్షిపణి నిరోధక వ్యవస్థలను ఏమార్చగల అవన్‌గార్డ్‌ క్షిపణి గంటకు 24,696 కి.మీ (20 మ్యాక్‌) వేగంతో దూసుకుపోగలదు. ఇందులో అమర్చిన గ్లైడర్ల కారణంగా క్షిపణి నిరోధక వ్యవస్థలకు చిక్కకుండా ఈ రాకెట్‌ ప్రపంచంలోని ఏ లక్ష్యాన్నయినా 30 నిమిషాల్లో  చిత్తుచేయగలదు.
ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ లో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి టీమిండియా 215 పరుగులు చేసింది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (76), పుజారా (68) అర్ధశతకాలు సాధించారు.

పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.

  • SCHOOL ASSEMBLY:27th DECEMBER

  • School Assembly 27th December Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,December month school assembly day wise,December 2018 school assembly,December 2018 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 27th December 2018 assembly, 27th December 2018 assembly,news of the day history,news of the day highlights,27th dec 2018 assembly, dec 27th assembly, dec 27th historical events, 27th December 2018 assembly, december 27th assembly, december 27th historical events,school related today assembly,school related today news, school related december 27th information, school related december month information
    Previous
    Next Post »
    0 Komentar