Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 22nd January Information

School Assembly 22nd January Information


చరిత్రలో ఈరోజు
➥1918: కాంగ్రెసు పార్టీ ఆంధ్ర ప్రాంత శాఖ ఏర్పాటయింది. ప్రత్యేకాంధ్ర ఏర్పాటులో ఇదో మైలురాయి.
1970: పెద్దదైన విమానం బోయింగ్ 747 వాడుకలోకి వచ్చింది
1992: సుభాష్‌చంద్రబోస్‌కు ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. సాంకేతిక కారణాల వల్ల తర్వాత ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు 1885 వ సం.లో జన్మించారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ద ఛిత్రకారుడు కొండపల్లి శేషగిరి రావు 1924 వ సం.లో జన్మించారు.
సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి 1936 వ సం.లో జన్మించారు.
బ్రిటీషు మహారాణిబ్రిటన్ రాణి విక్టోరియా 1901 వ సం.లో మరణించారు.
తెలుగు భాషావేత్త గిడుగు రామమూర్తి 1940 వ సం.లో మరణించారు.
ప్రముఖ తెలుగు నటుడు మరియు నిర్మాత అక్కినేని నాగేశ్వరరావు 2014 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
సూచక భిన్నాలు
ఒక ప్రదేశపు నిజకొలతలను అనగా పొడవు, వెడల్పు లను ఒకే నిష్పత్తిలో తగ్గించి తీసుకున్న కొలతలతో గీసిన చిన్న పటాలను పరిమాణమునకు గీయబడిన పటములు అంటాము లేక పరిమాణ పటము లేక ప్లాను అంటాము. ప్రదేశపు నిజ కొలతలకు, పరిమాణ పటములోని అనురూప కొలతలకు గల సంబంధాన్నే స్కేలు అంటాము.
సూచక భిన్నం = ప్లానులో దూరము/అనురూప నిజ దూరము
సూచక భిన్నములో లవము ఎప్పుడూ 1 ఉండాలి. సూచక భిన్నము ఉపయోగపడు అంశాలు :
i. రెండు స్థలముల మధ్య దూరమును పటములో గుర్తించుట.
ii. పటములో ఇవ్వబడిన 2 స్థలముల మధ్యనున్న దూరమును బట్టి అసలు దూరమును కనుగొనుట.

పటములో కొలత అసలు కొలతలో ఎన్నవ భాగమో సూచించు భిన్నమును సూచక భిన్నము అంటాము.
సుభాషితం:
ఆపదైన వేళ నరసి బంధుల జూడు
భయమువేళ జూడు బంటుతనము
పేదవేళ జూడు పెండ్లాము గుణమును
విశ్వదాభిరామ వినురవేమ
భావం - ఆపదల్లొ చిక్కుకున్నపుడు సహాయపడేవాడే భందువు.భయముతో ఉన్నపుడు ధైర్యం చెప్పేవాడే మిత్రుడు.కటిక బీదరికంలోనైనా భర్తను గౌరవించేదే భార్య.


వార్తలలోని ముఖ్యాంశాలు
లోక్‌పాల్‌ వ్యవస్థను ఇప్పటికే ఏర్పాటు చేసి ఉంటే రఫేల్‌ వంటి కుంభకోణాలకు అవకాశం ఉండేది కాదని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే అన్నారు.
భారత్‌ అంతకంతకూ యువ దేశంగా అవతరిస్తుండగా... అమెరికా, జపాన్‌, చైనాలు వృద్ధ దేశాలుగా మారుతున్నాయని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ పేర్కొన్నారు. నవ యువ భారత్‌నిర్మాణానికి ఇది బాగా కలిసొచ్చే అంశమన్నారు.
ఆక్స్‌ఫామ్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం దాదాపు సగానికి పైగా దేశ సంపద ఒక్కశాతం ధనవంతుల చేతుల్లోనే ఉందని, 9 మంది కుబేరుల సంపద- అట్టడుగునున్న 50% మంది జనాభా సంపదతో సమానమని వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్‌)లకు ఇచ్చే 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు, మిగతా 5 శాతం ఇతర అన్ని అగ్రకులాల పేదలకు ఇవ్వాలని నిర్ణయించింది.
తెలంగాణ రాష్ట్రం లో జరిగిన పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలిపి సోమవారం రాత్రి వరకు 4,415 స్థానాల ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో 2,606 (59 శాతం) సర్పంచి పదవులను తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతుదారులు, 906 (20 శాతం)కాంగ్రెస్‌ మద్దతుదారులు గెలుపొందారు.
భారతీయ అమెరికన్‌ సెనెటర్‌ కమలా హ్యారిస్‌ వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ తరఫున పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. కమల తల్లి తమిళనాడుకు చెందిన మహిళ, తండ్రి జమైకాకు చెందిన ఆఫ్రికన్‌అమెరికన్‌.
ఏడో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌పై కన్నేసిన టాప్‌ సీడ్‌ జకోవిచ్‌ రష్యాకు చెందిన 15వ సీడ్‌ ఆటగాడు మెద్వెదెవ్‌పై విజయం సాధించి టోర్నీ క్వార్టర్‌ ఫైనల్లో ప్రవేశించాడు. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లో సెరెనా విలియమ్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది.


పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.


  • SCHOOL ASSEMBLY:22nd January(నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం)
  • SCHOOL ASSEMBLY:22nd January(వార్తలలోని ముఖ్యాంశాలు)

  • School Assembly 22nd January Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,January month school assembly day wise,January 2019 school assembly,January 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 22nd January 2019 assembly, 22nd January 2019 assembly,news of the day history,news of the day highlights,22nd dec 2019 assembly, dec 22nd assembly, dec 22nd historical events, 22nd January 2019 assembly, january 22nd assembly, january 22nd historical events,school related today assembly,school related today news, school related january 22nd information, school related january month information, School Assembly 22nd Jan Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,Jan month school assembly day wise,Jan 2019 school assembly,Jan 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 22nd Jan 2019 assembly, 22nd Jan 2019 assembly,news of the day history,news of the day highlights,22nd dec 2019 assembly, dec 22nd assembly, dec 22nd historical events, 22nd Jan 2019 assembly, jan 22nd assembly, jan 22nd historical events,school related today assembly,school related today news, school related jan 22nd information, school related jan month information
    Previous
    Next Post »
    0 Komentar