Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 4th January information

School Assembly 4th January information


నేటి ప్రాముఖ్యత
వరల్డ్ బ్రెయిలీ దినోత్సవం
చరిత్రలో ఈరోజు
1988: గామిట్ ఇంట్రాఫెలోపియన్ ట్రాన్స్ఫర్ (GIFT) అనే ప్రక్రియ ద్వారా భారతదేశపు మొట్టమొదటి శిశువు జననం.
సుప్రసిద్ధ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ 1643 వ సం.లో జన్మించారు.
ఫ్రెంచ్ విద్యావేత్త మరియు బ్రెయిలీ లిపి సృష్టికర్త లూయీ బ్రెయిలీ 1809వ సం.లో జన్మించారు.
నార్వే దేశానికి చెందిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త, నోబుల్ బహుమతి గ్రహీత మే-బ్రిట్ మోసర్ 1963 వ సం.లో జన్మించారు.
ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు,"భారతదేశపు ఎడిసన్"గా ప్రసిద్ధుడు గోపాలస్వామి దొరస్వామి నాయుడు 1974 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 
భారత రాజ్యాంగంలోని 5వ భాగం 5వ అధ్యాయంలోని 148 నుండి 151 వరకు గల నిబంధనలు భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ను గురించి వివరిస్తాయి. భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ను రాష్ట్రపతి నియమిస్తాడు. ఇతడు కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్స్ ను తనిఖీ చేసి రిపోర్టులు తయారు చేస్తాడు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రిపోర్టును రాష్ట్రపతికి సమర్పిస్తాడు. రాష్ట్రపతి ఆ రిపోర్టును పార్లమెంటు ముందు ఉంచే ఏర్పాటు చేస్తాడు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నివేదికలను రాష్ట్ర గవర్నరుకు సమర్పిస్తాడు. రాష్ట్ర గవర్నరు ఆ రిపోర్టును రాష్ట్ర శాసన సభ ముందు ఉంచే ఏర్పాటు చేస్తాడు.


సుభాషితం:
అప్పిచ్చువాడు, వైద్యుడు,
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును, ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము,
చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ.
భావం -అవసరమునకు అప్పు ఇచ్చు మిత్రుడు,రోగము వచ్చినపుడు చికిత్స చేయుటకు వైద్యుడుని,ఎప్పుడును నీరెండక ప్రవహించు నదియు,శుభాశుభ కర్మలు చేయించు బ్రాహ్మణుడును ఉన్న ఊరిలో ఉండుము.ఈ సౌకర్యము లేని ఊరిలో ఉండకుము.
వార్తలలోని ముఖ్యాంశాలు
చికున్‌ గున్యా, డెంగీ, మెదడువాపు వ్యాధులతో పాటు పౌష్టికాహారలోపంపై టెక్నాలజీ ఆధారిత, చవకైన పరిష్కారాన్ని భారత శాస్త్రవేత్తలు కనుగొనాల్సిన సమయం ఆసన్నమయిందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీలో ప్రారంభమైన ‘106వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌వేడుకలలలో పాల్గొన్న మోదీ ఈ వాఖ్యలు చేశారు.
శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ, హిందూ సంస్థలు గురువారం తలపెట్టిన బంద్‌ హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణల్లో ఒకరు మృతిచెందగా, 100 మంది గాయపడ్డారు.
అంతరిక్ష పరిశోధనల్లో చైనా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చంద్రుడి అవతలి భాగంలో వ్యోమనౌకను దించింది. చాంగే-4 అనే ఈ రోబోటిక్‌ యంత్రం.. ఇప్పటివరకూ పెద్దగా శోధించని ఆ ప్రదేశానికి సంబంధించిన ఫొటోలను చాలా దగ్గరి నుంచి అందించింది.
ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం హామీలను అమలు చేయాలంటూ లోక్‌సభలో ఆందోళన చేస్తున్న 14 మంది తెదేపా ఎంపీలపై స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ గురువారం సస్పెన్షన్‌ వేటు వేశారు. 
మిషన్‌ కాకతీయకు రూ.5 వేల కోట్లు , భగీరథకు రూ.19,205 కోట్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రం కోరిన మీదట సహాయం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక శాఖ తెలియజేసింది.
➥వచ్చే ఆర్థిక సంవత్సరాని(2019-2020)కి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పనపై ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈసారి బడ్జెట్‌ రూ.2 లక్షల కోట్లు దాటనుందని భావిస్తున్నారు.
కంగారూల గడ్డపై నాలుగో టెస్టులో తొలి రోజు భారత్‌ పైచేయి సాధించింది. ఇప్పటికే మూడొందలు దాటిన కోహ్లీసేన భారీ స్కోరుపై కన్నేసింది.


పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.


  • SCHOOL ASSEMBLY:4th January(నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈరోజు,నేటి అంశము,సుభాషితం)
  • SCHOOL ASSEMBLY:4th January(వార్తలలోని ముఖ్యాంశాలు)

  • School Assembly 4th January Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,January month school assembly day wise,January 2019 school assembly,January 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 4th January 2019 assembly, 4th January 2019 assembly,news of the day history,news of the day highlights,4th dec 2019 assembly, dec 4th assembly, dec 4th historical events, 4th January 2019 assembly, january 4th assembly, january 4th historical events,school related today assembly,school related today news, school related january 4th information, school related january month information, School Assembly 4th Jan Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,Jan month school assembly day wise,Jan 2019 school assembly,Jan 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 4th Jan 2019 assembly, 4th Jan 2019 assembly,news of the day history,news of the day highlights,4th dec 2019 assembly, dec 4th assembly, dec 4th historical events, 4th Jan 2019 assembly, jan 4th assembly, jan 4th historical events,school related today assembly,school related today news, school related jan 4th information, school related jan month information
    Previous
    Next Post »
    0 Komentar