Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 8th January Information


School Assembly 8th January Information

చరిత్రలో ఈరోజు
1025 : సుల్తాన్‌ మహ్మద్‌ ఘజనీ సోమనాథ్‌ దేవాలయాన్ని దోచుకొని నేలమట్టం చేయించాడు. స్వయంగా తానే ఆలయంలోని జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేశాడు.
1965 : అమెరికన్‌ మ్యూజియం ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీ నుంచి చోరీకి గురైన ప్రపంచ ప్రసిద్ధ వజ్రం 'స్టార్‌ ఆఫ్‌ ఇండియా' తిరిగి లభ్యమైంది.
1995: ఆంధ్ర ప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడి వద్ద ఒ.ఎన్‌.జి.సికి చెందిన రిగ్గులో బ్లో ఔట్ జరిగింది.
ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ విలియం హాకింగ్ 1942 వ సం.లో జన్మించారు.
ప్రముఖ ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో 1642 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూడు రకాల అంకెల వ్యవస్థ అమలులో ఉన్నది.
1. దశాంశ పద్ధతి: '0' నుండి '9' వరకు అంకెలు ఉన్న పద్దతిని దశాంశ పద్దతి అని అంటారు. దీనినే అరబిక్ పద్దతి అని కూడా మరికొందరు అంటారు. 
2 రోమన్ పద్ధతి: ప్రాచీన నాగరికతలలలో హిందూ దశాంశమాన పద్దతి ప్రచారం కాక పూర్వం బాగా ఉపయోగంలో ఉన్నది 'రోమన్ పద్దతి'. ఇది ఇంగ్లీషు (లాటిన్) అక్షరాలు I, V, X, L, C, M (1, 5, 10, 50 100, 1000) ఆధారంగా రూపము ఏర్పరచుకున్నవి. రోమన్ పద్దతిలో I అనే ఇంగ్లీషు అక్షరం 1 సూచిస్తుంది. 2 రాయాలంటే II అలాగే 3కి III ఇక 'V' 5ను సూచిస్తాయి. 'X' పదిని, L 50ని, 'C' 100ని, 'D' 500ని, 'M' 1000ని సూచిస్తాయి. ఈ అక్షరాల మార్పులవల్ల ఇతర సంఖ్యలు ఏర్పడతాయి. 
3.బైనరీ పద్ధతి: దీనినే ద్విసంఖ్యామానము అని కూడా అంటారు. ప్రాచీన భారతీయులు 'చంధస్సు'లో బాగా ఉపయో గించారు. ఆధునికంగా కంప్యూటర్లలో వాడే భాషలకు 0, 1 గల బైనరీ పద్దతే ఆధారం.
మంచి మాట:
బాధ్యతగా జీవించినప్పుడే మనం, మన చుట్టూ ఉన్న వారు ఆనందంగా ఉంటాం...
వార్తలలోని ముఖ్యాంశాలు
అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగ రంగాల్లో  10% రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. 10 శాతం కోటా వల్ల బ్రాహ్మణులు, వైశ్య, కమ్మ, కాపు, రెడ్డి వంటి పలు సామాజిక వర్గాలు లబ్ధి పొందనున్నాయి.
ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు సాధారణ విభాగంలో రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాజ్యాంగంలోని 15, 16 అధికరణలను సవరించాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవరణ బిల్లును.. పార్లమెంటు శీతాకాల సమావేశాలకు చివరిరోజైన మంగళవారమే ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తున్నది.
ఏపీకి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నవయుగ సంస్థ 24 గంటల్లో 32, 315 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులతో గిన్నిస్‌ రికార్డు సృష్టించింది.
71 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కంగారూల నేలపై తొలిసారి టెస్టు సిరీస్‌ను చేజిక్కించుకుని టీమ్‌ ఇండియా చరిత్ర సృష్టించింది. భారత బ్యాటింగ్‌కు వెన్నెముకలా నిలిచిన చెతేశ్వర్‌ పుజారాకు మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌, మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌అవార్డులు లభించాయి.
ఏపి విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై లోతైన అధ్యయనం చేసిన లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్‌ నారాయణ్‌ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ పది ముఖ్యమైన అంశాలపై సమగ్ర నివేదిక విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సింది రూ.85 వేల కోట్లు అని కేంద్రం గ్రాంట్లు, ప్రత్యేక సాయం రూపంలో ఆదుకోవాలని సూచించింది.
తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని పెంచాలని ఇందులో భాగంగా ఎల్లంపల్లి దిగువన అదనపు సొరంగ మార్గం తవ్వకానికి సంబంధించి సర్వే చేపట్టినట్లు సమాచారం.
పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ దేశాలకు చెందిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ ముసాయిదా బిల్లు–2018కు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.

పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.

  • SCHOOL ASSEMBLY:8th January(చరిత్రలో ఈరోజు,నేటి అంశము,మంచి మాట)
  • SCHOOL ASSEMBLY:8th January(వార్తలలోని ముఖ్యాంశాలు)

  • School Assembly 8th January Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,January month school assembly day wise,January 2019 school assembly,January 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 8th January 2019 assembly, 8th January 2019 assembly,news of the day history,news of the day highlights,8th dec 2019 assembly, dec 8th assembly, dec 8th historical events, 8th January 2019 assembly, january 8th assembly, january 8th historical events,school related today assembly,school related today news, school related january 8th information, school related january month information, School Assembly 8th Jan Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,Jan month school assembly day wise,Jan 2019 school assembly,Jan 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 8th Jan 2019 assembly, 8th Jan 2019 assembly,news of the day history,news of the day highlights,7th dec 2019 assembly, dec 7th assembly, dec 7th historical events, 7th Jan 2019 assembly, jan 7th assembly, jan 7th historical events,school related today assembly,school related today news, school related jan 7th information, school related jan month information
    Previous
    Next Post »
    0 Komentar