Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RGUKT officially accredited by the UGC

RGUKT officially accredited by the UGC

రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (RGUKT) కి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) గుర్తింపు
రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ)కి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి 12బీ గుర్తింపు లభించినట్లు చాన్సలర్ ఆచార్య, కేసీ రెడ్డి తెలిపారు. పేద విద్యార్థులకు ఉత్తమ సాంకేతిక విద్యను అందించాలనే సదాశయంతో 2008లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేశారని, వీటిని నిర్వహిస్తున్న ఆర్జీయూకేటీకి యూజీసీ గుర్తింపు లభించడం వల్ల అవి మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. యూజీసీ నుంచి ఆర్జీయూకేటీ కి ఇకపై ఆర్థిక సహకారం కూడా అందుతుందన్నారు. యూనివర్సిటీ స్థాపించిన 12ఏళ్లకు యూజీసీ గుర్తింపు లభించడం పట్ల ట్రిపుల్ ఐటీలలో పనిచేస్తున్న అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.
UGC website

Previous
Next Post »
0 Komentar

Google Tags