Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School Assembly 14th December Information

School Assembly 14th December Information

నేటి ప్రాముఖ్యత 
  • జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం
  • అంతర్జాతీయ కోతుల రోజు
చరిత్రలో ఈ రోజు
2001వ సంవత్సరంలో భారత ప్రభుత్వం  బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంధన పొదుపు చట్టాన్ని తీసుకొచ్చింది. ఎనర్జీ మేనేజ్‌మెంట్‌, ప్రోజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్సింగ్‌, ఇంప్లిమెంటేషన్లలో నిపుణులైనవారిని, క్వాలిఫైడ్‌ ప్రొఫెషనల్స్‌ను ఆయా ఉద్యోగాలకు నియమించాలి. ఇలా చేయడంవల్ల ఇంధనం దుబారా కాదు, సంస్థలూ నష్టపోవు. ఇంధనాన్ని పొదుపు చేయమని చాటి చెప్పడానికే డిసెంబర్‌ 14వ తేదీని జాతీయ ఇంధన పొదుపు దినోత్సవంగా గుర్తించి, ఇంధన పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తున్నారు.
మార్క్స్, లెనిన్ సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాంతం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడిన మాకినేని బసవపున్నయ్య పుట్టిన రోజు
భరత్ అరుణ్ భారతదేశపు మాజీ టెస్ట్ క్రికెటర్ పుట్టిన రోజు
 అమెరికాకు మొట్ట మొదటి అధ్యక్షుడు అయిన జార్జి వాషింగ్టన్ 1799 వ సం. లో మరణించారు.
మహామహోపాధ్యాయ బిరుదు పొందిన ఆధునికాంధ్రులలో రెండవ వ్యక్తిగా ఘనత వహించిన సంగీతజ్ఞుడు, కవి, నాటక రచయిత అయిన కొక్కొండ వేంకటరత్నం పంతులు 1915 వ సం. లో మరణించారు.
నేటి అంశము- సోషల్ స్టడీస్ 
హిమాలయాలు ఎలా ఏర్పడ్డాయి..?
   భారత్ నేడు ఆసియా లో ఒక భాగం. కానీ ఐదు కోట్ల ఏళ్ల క్రితం దానికదే ఒక ఖండం. ఆనాటి భరత ఖండం నీటి మీద కదులుతూ వెళ్లి ఆసియాతో కలిసి పోయింది. ఈ కలయిక జరిగేటప్పుడు భారతం ఆసియా అంచులు కింది నుండి పైకి ఢీకొట్టింది.  దాంతో అక్కడి భూభాగం పైకి లేచింది. ప్రపంచపు అత్యున్నత పర్వతశ్రేణి గా ఆవిర్భవించింది. వీటిని మనం హిమాలయాలు అంటున్నాము. ఇవి ఈ ప్రపంచంలో కెల్లా అతి ఎత్తైన పర్వతాలు. ఈ భారీ పర్వతాల శ్రేణిలో మొత్తం 26 శిఖరాలు ఉన్నాయి. వీటి ఎత్తు 25 వేల అడుగులు (7,620 మీటర్లు) మించి ఉంటుంది.
మంచి మాట/సుభాషితం
జ్ఞానమనేది సంపాదిస్తే వచ్చేది కాదు, మనలోని అజ్ఞానాన్ని క్రమంగా తొలగించుకోవడం ద్వారా పెరిగేది - గౌతమ బుద్ధుడు


వార్తలలోని ముఖ్యాంశాలు 
➥ ఏపికి మరో తుఫాన్ ముంచుకురానుంది. మొన్ననే తిత్లీ ప్రభావంతో ఉత్తరాంధ్ర అతలాకుతలం కాగా ఇప్పుడు దక్షణకోస్తాకు విపత్తు ప్రభావం సూచనలు కనిపిస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తుఫాన్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. 
➥ ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ విలువైనదే. ఒక్కోసారి కేవలం రెండు, మూడు ఓట్లు అభ్యర్థుల తలరాతలను మార్చేస్తాయి. ఇటీవల వెల్లడైన మిజోరం శాసనసభ ఎన్నికల్లో మిజోరం నేషనల్‌ ఫ్రంట్‌ (ఎమ్‌ఎన్‌ఎఫ్‌) అభ్యర్థి లాల్‌చందామ రత్లే... త్యూవల్‌ నియోజక వర్గం నుంచి పోటీ చేసి మూడు ఓట్ల తేడాతో గెలిచారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 5,207 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్‌ నేత ఆర్‌ఎల్‌ పియాంమావియాకి 5,204 ఓట్లు వచ్చాయి. 
➥ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు రెండవ సారి ప్రమాణస్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం 1.25 గంటలకు రాజ్‌భవన్‌లో కేసీఆర్‌తో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణం చేయించారు. ఇదిలా ఉండగా ఎన్నికైన శాసనసభ్యుల్లో అన్ని పార్టీల నుంచి మొత్తం 106 మంది కోటిశ్వర్లు 67 మంది నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఎన్నికయ్యారని  ఏడీఆర్, ఎన్నికల నిఘూవేదిక నివేదికలో వెల్లడి.
➥ ఆరోగ్యం కోసం ఆస్తులు అమ్ముకునే రోజులు పోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. పేదలను ఆ బాధ నుంచి తప్పించడం చాలెంజ్ గా ఉందని అన్నారు. ప్రభుత్వ నిధులతో దేశంలో తొలిసారి విశాఖపట్నం లో నిర్మించిన వైద్య పరికరాల పార్క్ మెడ్ టెక్ జోన్ ను  ముఖ్యమంత్రి గురువారం జాతికి అంకితం చేశారు.
➥ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సీనియర్ నేత కమల్ నాథ్ (72 సంవత్సరాలు) ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది.
➥ బ్రిటన్ ప్రధాని థెరెసా మేకి అవిశ్వాస గండం తప్పింది. బుధవారం రాత్రి జరిగిన ఓటింగ్ లో థెరెసా మే కి చెందిన కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు 317 మంది పాల్గొనగా, 200 వందల మంది ఆమెకు అనుకూలంగా, మరో 117 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. 2022 సాధారణ ఎన్నికల్లో తాను పార్టీకి వహించినని  థెరెసా మే హామీ ఇవ్వడంతో పలువురు అసంతృప్త ఎంపీలు శాంతించారు. యూరోపియన్ యూనియన్ (ఈయూ) తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆమె సొంత పార్టీ ఎంపీలు, మంత్రులే వ్యతిరేకించటం తెలిసిందే.


School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,december month school assembly day wise,december 2018 school assembly,december 2018 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 14th december 2018 assembly, 14th december 2018 assembly,news of the day history,news of the day highlights,14th dec 2018 assembly, dec 14th assembly, dec 14th historical events, 14th december 2018 assembly, december 14th assembly, december 14th historical events,school related today assembly,school related today news, school related december 14th information, school related december month information
Previous
Next Post »
0 Komentar

Google Tags