Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School Assembly 15th December Information

School Assembly 15th December Information

నేటి ప్రాముఖ్యత 
పొట్టి శ్రీరాములు అమరజీవి అయినరోజు.
ఇంటర్నేషనల్ టీ డే.
చరిత్రలో ఈ రోజు
ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు 56 రోజుల ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు ప్రాత:. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు1952 వ.సం. లో అమరజీవి అయ్యాడు.
ప్రముఖ చిత్రకారుడు, సినీ దర్శకుడు అయిన బాపు 1933 న జన్మించారు. .
సర్దార్ వల్లభాయి పటేల్, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ కేంద్ర మంత్రి 1950 లో మరణించారు.
తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు మరియు నటుడు అయిన చక్రి 2014 వ.సం. లో మరణించారు.
నేటి అంశము- ఆరోగ్యం/వ్యాయామవిధ్య/మంచి అలవాట్లు  
మలబద్దకం, విరేచనం సరిగ్గా జరగకపోవడం.. ఈ రెండు సమస్యలతో నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా జరిగిన ఓ సర్వే ప్రకారం.. మెట్రో నగరాల్లో నివసించే 100 మందిలో 22 మంది అనారోగ్యకరమైన అలవాట్లు, జీవనశైలిని కలిగి ఉన్నారని తెలిసింది. ఇలాంటి వారే ఎక్కువగా అజీర్ణం, మలబద్దకం బారిన పడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఇక ఈ సమస్యలకు ఏం చేయాలో తెలియక చాలా మంది అవస్థలు పడుతున్నారు. అలాంటి వారు కింద సూచించిన పండ్లను నిత్యం తింటే దాంతో జీర్ణ సమస్యలు ఉండవు. మలబద్దకం తగ్గుతుంది. మరి ఆ పండ్లు ఏమిటంటే...
1. ద్రాక్ష
ద్రాక్షల్లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల ద్రాక్షను తింటే 4 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. పైబర్ వల్ల పేగుల్లో మలం కదలిక సరిగ్గా ఉంటుంది. దీంతో విరేచనం సులభంగా అవుతుంది. అలాగే తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణమవుతుంది. మలబద్దకం పోతుంది. ద్రాక్షలను నిత్యం తింటే జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు.
2. నారింజ
నారింజ పండ్లలోనూ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. నారింజలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే వాటిల్లో ఉండే సాల్యుబుల్ ఫైబర్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది. అలాగే ఈ పండ్లలో ఉండే నారింజెనిన్ అనే పదార్థం లాక్సేటివ్‌గా పనిచేస్తుంది. అంటే.. విరేచనం సాఫీగా అయ్యేందుకు తోడ్పడుతుందన్నమాట. కనుక నారింజను నిత్యం తింటే జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు.
3. జామ
జామ పండ్లలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని పోగొడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. జామ ఆకులను తిన్నా ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. జామ ఆకుల్లో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి డయేరియాను తగ్గిస్తాయి.మంచి మాట/సుభాషితం
చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో, చెట్టును చూసి ఎదుగుదలను నేర్చుకో, భూమిని చూసి ఓర్పు నేర్చుకో - సర్వేపల్లి రాధాకృష్ణన్‌
వార్తలలోని ముఖ్యాంశాలు 
➥ ప్రముఖ బెంగాలీ నవలా రచయిత అమితవ్‌ ఘోష్‌కు అరుదైన గౌరవం దక్కింది. దేశ అత్యున్నత సాహిత్య పురస్కారమైన 'జ్ఞాన్‌పీఠ్‌' ఆయన్ను వరించింది. సాహిత్య రంగానికి ఆయన అందించిన సేవలకు ఈ ఏడాది గానూ ప్రతిష్టాత్మక జ్ఞాన్‌పీఠ్‌ పురస్కారానికి 'భారతీయ జ్ఞాన్‌పీఠ్‌' ఎంపిక చేసింది.
రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పందంలో అవకతవకాలు జరిగాయని, భారీ అవినీతి జరిగిందన్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపణల్లో నిజం లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. రఫేల్‌ ఒప్పంద నిర్ణయ విధానం, ధరల వ్యవహారం, అంతర్జాతీయ ఒప్పందం వంటి అంశాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణాలు కన్పించట్లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
➥ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం తీవ్ర వాయుగుండంగా మారింది. దాదాపుగా సోమవారం నాటికి తీవ్ర తుపానుగా మారి ఒంగోలు-కాకినాడ మధ్యలో తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీని ప్రభావంతో కోస్తా అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఐతే ఈ తుఫాన్ కు 'ఫెథాయ్' గా థాయ్ లాండ్ నామకరణం చేసినది.
➥ అరుదైన ఒక తోకచుక్క భూమికి దగ్గరగా రానుండడంతో ప్రత్యేక ఏర్పాట్లు లేకుండా శనివారం నుండి దానిని సాధారణంగానే చూడొచ్చని తమిళనాడులోని కొడైకెనాల్ లో ఉన్న ఆస్ట్రో ఫిజికల్ అబ్జర్వేటరీ తెలిపింది. 46 పి/విర్తెనియన్ గా పిలిచే ఈ తోకచుక్కను భారత్లోని ప్రజలంతా టెలిస్కోప్ లేకుండానే చూడొచ్చని పేర్కొంది.
➥ రాజస్థాన్‌ కొత్త ముఖ్యమంత్రిగా అశోక్‌ గెహ్లాట్‌ పేరును కాంగ్రెస్‌ శుక్రవారం ప్రకటించింది. సచిన్‌ పైలట్‌ డిప్యూటీ ముఖ్యమంత్రిగా వుంటారని తెలిపింది. ఇదిలా ఉండగా ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రిగా టి.ఎస్. సింగ్ దేవ్ ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసే అవకాశం ఉన్నది.
➥ అడిలైడ్ విజయంతో చారిత్రక సిరీస్ విజయం పై కన్నేసిన టీమిండియాకు పరీక్ష మొదలైంది. పెర్త్ టెస్టులో తొలి రోజు ఆస్ట్రేలియాదే పైచేయి. ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు 277/6తో పటిష్ఠ స్థితిలో నిలిచింది.
➥ బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. తిరుగులేని విజయంతో టోర్నీ సెమీస్‌కు చేరుకుంది. పురుషుల విభాగంలోనూ సమీర్‌ వర్మ అద్భుతం చేశాడు. నాకౌట్‌ దశకు అర్హత సాధించాడు.


School Assembly 15th December Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,december month school assembly day wise,december 2018 school assembly,december 2018 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 15th december 2018 assembly, 15th december 2018 assembly,news of the day history,news of the day highlights,15th dec 2018 assembly, dec 15th assembly, dec 15th historical events, 15th december 2018 assembly, december 15th assembly, december 15th historical events,school related today assembly,school related today news, school related december 15th information, school related december month information
Previous
Next Post »
0 Komentar

Google Tags