Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School Assembly 7th January Information

School Assembly 7th January Information
చరిత్రలో ఈరోజు
భారత జాతీయ సైన్సు అకాడమీని 1935 వ సం. లో కలకత్తాలో నెలకొల్పారు.
సంఘ సంస్కర్త, బాల కార్మికులపై చేసిన కృషికి రామన్ మెగస్సే అవార్డు గ్రహీత శాంతా సిన్హా 1950 వ సం.లో జన్మించారు.
ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, విమర్శకులు, పరిశోధకులు పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి 1950 వ సం.లో మరణించారు.
జైపూర్ పాదం సృష్టికర్త ప్రమోద్ కరణ్ సేథీ 2008 వ సం.లో మరణించారు.
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ 2016 వ సం.లో మరణించారు.
 నేటి అంశము:
బాసికం
మానవుని శరీరంలోని నాడులలో ఇడ, పింగళ, సుషుమ్న అనే మూడు నాడులు ముఖ్యమైనవి. వీటిల్లో సుషుమ్న అనే నాడికి కుడివైపు సూర్యనాడి, ఎడమవైపు చంద్రనాడి ఉంటాయి. ఇవి రెండూ కలిసే చోటు ముఖంలోని భ్రూమధ్యం. దీనిపై ఇతరుల దృష్టిపడకుండా వధూ వరులకు ఈ స్థానాన్ని కప్పడానికి బాసికధారణ చేస్తారు.
సుభాషితం:
ఇనుము విరిగె నేని యిరుమారు ముమ్మారు
కాచి యతుకవచ్చు క్రమముగాను
మనసు విరిగెనేని మరియంట నేర్చునా
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం - ఇనుము విరిగితే దానిని రెండు మూడు సార్లు అతికించవచ్చు. కానీ అదే మనిషి మనసు ఒక సారి విరిగితే(అంటే ఏదైనా విషయం వల్ల మనసు నొచ్చుకుంటే) దానిని మరళా అతికించుట ఆ బ్రహ్మ దేవిని వల్ల కూడా కాదు.
మంచి మాట
"బాధే…. బలవంతుడిని చేస్తుంది.. వైఫల్యమే వివేకాన్ని నేర్పుతుంది"
నేటి జీ.కె
ప్రశ్న: ద్వంద్వ పరిపాలన విధానంలో ప్రాంతీయ ప్రభుత్వాలకు ఎక్కువ అధికారాలను ఇచ్చింది?
జ: భారత ప్రభుత్వ చట్టం - 1919
వార్తలలోని ముఖ్యాంశాలు
> తొలి ఏడాదిలో అమ్మ ఒడిపథకానికి సంబంధించి 75 శాతం హాజరు నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని,  అర్హులందరికీ సంతృప్తికర స్థాయిలో అమ్మ ఒడి పథకం అందాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
> గత 14 నెలలుగా పాకిస్తాన్‌ జైలులో మగ్గుతున్న 20 మంది ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. గుజరాత్‌ తీర ప్రాంతంలో చేపల వేట సాగిస్తూ పొరపాటున పాకిస్తాన్‌ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించడంతో వీరంతా పట్టుబడ్డ సంగతి తెలిసిందే.
> జాతీయ అంతర్జాతీయ స్టార్టప్, ఇన్ఫర్మేషన్‌ ఈకో సిస్టంలో తెలంగాణకు అగ్రస్థానం లభించిందని భవిష్యత్తు అంతా పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్‌లదేనని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు.
> తెలంగాణ మున్సిపాలిటీలు, మున్సి పల్‌ కార్పొరేషన్ల ఎన్నికల నోటిఫికేషన్‌ను మంగళవారం తాము ఉత్తర్వులు జారీ చేసే వరకు ఇవ్వొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.
> ఢిల్లీ నిరసనల జ్వాలల్లో చిక్కుకోవడానికి కాంగ్రెస్, ఆప్‌లే కారణమంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
> ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల నోటిఫికేషన్‌ జనవరి 14వ తేదీన విడుదలకానున్నది. ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికలు, 11న ఫలితాలు వెలువడనున్నాయని ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) సునీల్‌ అరోరా తెలిపారు.
> ఇరాన్‌ జనరల్‌ సులేమానీ మృతికి కారణమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తలకు ఇరాన్‌ వెలకట్టింది. ఆయన్ను చంపిన వారికి దాదాపు రూ.575 కోట్ల భారీ నజరానా ఇస్తామని ప్రకటించింది.

> పశ్చిమాసియాలో అమెరికా రాజేసిన యుద్ధభయాలతో స్టాక్‌ మార్కెట్లు వణికిపోతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం, ముడిచమురు ధరలు 2 శాతం మేర పెరగడం నష్టాలకు మరింత ఆజ్యం పోసింది.
School Assembly 7th January Information, School Assembly, prayer songs, Assembly information, historical events, information of the day, news of the day, golden words, today golden words, moral sentences
Previous
Next Post »

1 comment

Google Tags