Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Awareness Programs in Schools

Awareness Programs in Schools

అమ్మఒడి వారోత్సవాలు
వారోత్సవాల చివరి రోజు (జనవరి 9) నిర్వహించే కార్యక్రమాల వివరాలు..
* జగనన్న అమ్మ ఒడి పథకం ప్రారంభోత్సవం.
*అర్హులైన తల్లులు/సంరక్షకులని పాఠశాలలకు ఆహ్వానించాలి.
*గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్ధాయి ప్రజాప్రతినిధులను కూడా ప్రారంభోత్సవ సమావేశానికి ఆహ్వానించాలి.
*ఈ కార్యక్రమాన్ని రాష్ట్రస్ధాయిలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభిస్తున్నందున కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రతి పాఠశాలలో పిల్లలు, తల్లిదండ్రులు చూసేందుకు వీలుగా T.V.ఏర్పాటు చేయాలి.

*ప్రారంభోత్సవాన్ని పండుగను తలపించేలా వేడుకలాగా నిర్వహించాలి.
తేదీ. 08-01-2020 నాటి అంశం  మనబడి నాడు - నేడు పై అవగాహన
* మనబడి నాడు - నేడు – అవగాహన: ప్రభుత్వ పాఠశాలల్లో 'మనబడి- నాడు -నేడు' కార్యక్రమం అమలు గురించి తల్లిదండ్రుల కమిటీలకు మరియు తల్లిదండ్రులకు అవగాహనా కార్యక్రమం.
* పాఠశాలల్లో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా తీసుకుంటున్న చర్యల గురించి తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలి.

 * అంతేగాక మరుగుదొడ్ల పారిశుద్ధ్య నిర్వహణలో పాఠశాల తల్లిదండ్రుల కమిటీ భాద్యత గురించి కూడా వారికి వివరించాలి.
> తేదీ. 07-01-2020 నాటి అంశం  ఆంగ్ల మాధ్యమం - ఆవశ్యకత.
> ఈ రోజు పాఠశాలలో  ఆంగ్లమాధ్యమం ప్రవేశానికి  సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక గురించి  విద్యార్థులకు తల్లిదండ్రులకు వివరించడం  మరియు  ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం గురించి తల్లిదండ్రుల కమిటీ సమావేశంలో చర్చించడం.
> ఈ సమావేశంలో పేరెంట్స్ కమిటీ మరియు తల్లిదండ్రులకు ఆంగ్ల మాధ్యమం ఆవశ్యకత గురించి వివరిస్తూ వారి యొక్క అభిప్రాయాలను సేకరించాలి.
> సేకరించిన అభిప్రాయాలను మండల విద్యాశాఖ అధికారులకు అందజేయాలి.
> మండల విద్యాశాఖ అధికారులు ఉప విద్యాశాఖ అధికారులు మరియు ప్రధానోపాధ్యాయులు ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
నేటి కార్యక్రమ వివరాలు (తేది : 06.01.2020)
మధ్యాహ్నభోజన పథకం
మధ్యాహ్నభోజన పథకం నాణ్యత పెంపు
ఆహార పట్టీకలో సంక్రాంతి తర్వాత మార్పుల గురించి తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు,తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
ఈరోజు తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు మరియు తల్లిదండ్రులకు  మధ్యాహ్నం భోజన పథకం నాణ్యత పెంపు మరియు పట్టికలో సంక్రాంతి తర్వాత మార్పుల గురించి తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు అవగాహన కార్యక్రమం  నిర్వహించాలి. ఈ కార్యక్రమంలో   తల్లిదండ్రులు అందరికీ  సామూహిక భోజనాలు  ఏర్పాటు చేయాలి.
పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంలో చేపట్టిన మార్పులను వారికి వివరించి మధ్యాహ్న భోజనం పాఠశాలలోని చేసేటట్లు  ప్రోత్సహించాలి.
తల్లిదండ్రులు భోజనం నాణ్యతను పరిశీలించి తగు సూచనలు సలహాలు ఇవ్వాలి.
నూతన ఆహార పట్టికను మరియు అదనపు పౌష్టికాహారాన్ని సంక్రాంతి తర్వాత పాఠశాలలో అమలు చేయటం జరుగుతుంది.  ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 200 కోట్ల రూపాయలు  ఖర్చు చేయనున్నది.
ఈ రోజు కార్యక్రమమునకు  మధ్యాహ్న భోజన పథకం వివరాలను కరపత్రం రూపంలో తల్లిదండ్రులకు ఇవ్వవలెను. ఈ కార్యక్రమమునకు ప్రజాప్రతినిధులను గ్రామ పెద్దలు ఆహ్వానించాలి.

ప్రతిరోజు కార్యక్రమాలను మండల విద్యాశాఖ అధికారులు మరియు ఉప విద్యాశాఖ అధికారులు మరియు సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు పాఠశాలను సందర్శించి  కార్యక్రమంలో పాల్గొంటారు.


నేటి కార్యక్రమ వివరాలు (తేది : 04.01.2020)
జగనన్న అమ్మఒడి పథకంపై తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు, తల్లిదండ్రులకు& సంరక్షకులకు అవగాహన కార్యక్రమం.
అమ్మఒడి పథకంలో గుర్తించిన అర్హులైన తల్లులు/ సంరక్షకుల జాబితా ప్రదర్శించాలి.
అమ్మఒడి పథకం కింద ఇంకా గుర్తింపు పొందాల్సిన•••అర్హులైన తల్లులు/ సంరక్షకులు ఉంటే వారి వివరాలు తగిన ధ్రువపత్రాలతో సేకరించి సంబంధిత మండల విద్యాశాఖాధికారికి అందజేయాలి.

అమ్మఒడి వారోత్సవాలు మోడల్ ఫ్లెక్స్

అమ్మ ఒడి ని విద్యా సంస్థల్లో అమలుపరుచుట పై CSE వారి సూచనలు..రోజూ వారి షెడ్యూల్.. Rc.242,Dt.2/1/2020
జనవరి 4 నుంచి పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు-వివరాలు
ఈనెల 4 నుంచి 9 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో విద్యా కమిటీ సభ్యులు ఇతర మహిళలు విద్యార్థుల తల్లులతో సమావేశాలను నిర్వహించాలని కోరారు.
*4న అమ్మఒడి కార్యక్రమంపై అవగాహన కల్పించాలి.
*5న మధ్యాహ్న భోజన పథకం ఎలా జరుగుతుంది తదితర విషయాలను తల్లులతో చర్చించాలని పేర్కొన్నారు.
*6న సెలవు
*7న ఆంగ్లమాధ్యమం పాఠశాలల్లో ప్రవేశపెడుతున్న విషయాన్ని కూడా తెలియజేయాలని సూచించారు.
*8న పాఠశాలలు నాడు నేడు కార్యక్రమాన్ని వివరించాలని పేర్కొన్నారు.
*9న పాఠశాలల పరిధిలో తల్లులకు అమ్మఒడి చెక్కులను అందించే కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు.
ఈమేరకు ఉత్తర్వులను జారీ చేశారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags