Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School Assembly 12th March Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....


School Assembly 12th March Information
చరిత్రలో ఈరోజు
*1930: మహాత్మాగాంధీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహం సబర్మతీ ఆశ్రమం నుండి ప్రారంభమైంది. 
*2007: భారత సమాచార ఉపగ్రహం ఇన్సాట్-4బి విజయవంతంగా ప్రయోగించబడింది.
*1894 సం. లో మిసిసిపీలోని విక్స్బర్గ్లో మొట్టమొదటిసారిగా  కోకా-కోలా సీసాలో నింపబడి విక్రయించబడింది.
*1993సం.లో ముంబైలో పలు బాంబు పేలుళ్ల దుర్ఘటనలో దాదాపు 300 మంది చనిపోయారు, వందల కొద్దీ గాయపడ్డారు.
*సంస్కృత భాషా పండితుడు, అమర భాషలో ఆధునికుడు, తెలంగాణ సంస్కృత వాచస్పతి శ్రీ భాష్యం విజయసారథి 1937 వ సం.లో జన్మించారు.
*వ్యంగ్య చిత్రకారుడు ఆలపాటి వెంకట మోహనగుప్త 1947 వ సం.లో జన్మించారు.
*ప్రముఖ భారతీయ సమకాలీన కళాకారిణి వి.అనామిక 1975 వ సం.లో జన్మించారు.
*నిజాం విమోచన పోరాటయోధుడు, రాజకీయ నాయకుడు మందుముల నరసింగరావు 1976 వ సం.లో మరణించారు.
*ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక రాజకీయ నాయకుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు భూమా నాగిరెడ్డి 2017 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
పై - π
పై (Pi) లేదా π అనేది చాలా ముఖ్యమైన గణిత స్థిరాంకాలలో ఒకటి. దీని విలువ సుమారుగా 3.14159. యూక్లీడియన్ జియోమెట్రీలో ఒక వృత్తం యొక్క వైశాల్యం, మరియు అదే వృత్తం యొక్క అర్ధ వ్యాసం యొక్క వర్గంల నిష్పత్తిని "పై" అనే గుర్తుతో సూచిస్తారు. గణితం, సైన్సు, ఇంజినీరింగ్ వంటి అనేక శాస్త్రాలలో వాడే సమీకరణాలలో "π" గుర్తు తరచు వస్తూంటుంది.
మంచి మాట:
ప్రతిఫలం ఆశించకుండా చేసే మేలు సముద్రం కంటే గొప్పది- మదర్‌ థెరెసా
నేటి జీ.కే.
ప్రశ్న:
జ.


వార్తలలోని ముఖ్యాంశాలు
> *ప్రైవేట్‌ స్కూల్స్‌పై హైకోర్టు సీరియస్‌: ప్రైవేట్‌ స్కూల్స్‌పై హైకోర్టు సీరియస్‌ అయింది. స్కూళ్లలో ఫీజులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని పేర్కొంది. తిరుపతిరావు ఇచ్చిన కమిటీ నివేదికను ఎందుకు అమలు చేయడం లేదు? అని ప్రశ్నించింది. అధిక ఫీజులు వసూలు చేసే స్కూళ్ల జాబితా ఇవ్వాలని హైకోర్టు కోరింది. ఏప్రిల్‌ 8లోగా పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.*

> *ఇటలీ ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు: ఇటలీ ఎయిర్‌పోర్టులో తెలంగాణ విద్యార్థులు చిక్కుకున్నారు. కరోనా భయంతో విద్యార్థులను ఎయిర్‌పోర్టులో అధికారులు నిలిపివేశారు. జెనావో ఎయిర్‌పోర్టులో తెలంగాణ విద్యార్థులతో పాటు కేరళ, నాగ్‌పూర్‌, బెంగళూరు విద్యార్థులు ఉన్నారు. ఎంఎస్‌ పూర్తి కావడంతో భారత్‌కు ద్యార్థులు బయల్దేరారు.*

> *అంతర్జాతీయ నౌకల ప్రవేశంపై నిషేధం: కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. విదేశీయులకు ఇచ్చే వీసాలపై ఇప్పటికే ఆంక్షలు విధించిన కేంద్రం తాజాగా జలమార్గాల్లో వచ్చే ప్రయాణికులపై కూడా తాత్కాలిక నిషేధం విధించింది.*

> *కరోనా ఎఫెక్ట్‌: స్టేడియంలోకి ఎవరికీ నో ఎంట్రీ. ఇండియా ఓపెన్‌ సూపర్‌ 500 టోర్నీకి అభిమానులు దూరం: కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) అనూహ్య నిర్ణయం తీసుకుంది.*


*1.తెలంగాణకు చెందిన పర్వతారోహకుడు అంగోతు తుకారాం ఆస్ట్రేలియాలో అత్యంత ఎత్తయిన పర్వతం మౌంట్‌ కోషియాస్కోను అధిరోహించాడు.*

*2.పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్ టికెట్లను వెబ్ సైట్ లో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సత్యనారాయణరెడ్డి తెలిపారు.*

*3.కరోనా(కొవిడ్-19) అంటువ్యాధిగా  విశ్వరూపం దాలుస్తున్న నేపథ్యంలో కేంద్రం'అంటురోగాల చట్టం-1897 లోని సెక్షన్-2 నిబంధనల్ని దేశ మంతటా అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది.*

*4.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. పొదుపు (ఎసీబీ) ఖాతాలో కనీస నిల్వ లేకపోతే, జరిమానా విధించే నిబంధనను రద్దు చేసింది.*

*5.ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నది.ఆయుధాల దిగుమతిలో  సౌదీ అరేబియా, భారత్‌, ఈజిప్ట్‌, ఆస్ట్రేలియా, చైనా వరుసగా తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి.*

*6. జైలు నుంచి తాలిబన్లను విడుదల చేసేందుకు అఫ్గనిస్తాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దశలవారీగా వారిని విడుదల చేయాలంటూ బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.*

*7.ఒలింపిక్స్‌కు భారత్‌ తరఫున 9మంది బాక్సర్లు అర్హత సాధించి రికార్డ్ సృష్టించారు . లండన్‌(2012)కు 8మంది క్వాలిఫై కా వడమే ఇప్పటి వరకు అత్యుత్తమం.*


*GSRAO GK GROUPS జి సైదేశ్వర రావు*
School Assembly 12th March Information, School Assembly, prayer songs, Assembly information, historical events, information of the day, news of the day, golden words, today golden words, moral sentences, today's importance, headlines in the news, March month school assembly day wise, March 2020 school assembly, March 2020 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యతచరిత్రలో ఈ రోజునేటి అంశముమంచి మాట / పద్యంవార్తలలోని ముఖ్యాంశాలు, 12th March 2020 assembly, 12th March 2020 assembly, news of the day history, news of the day highlights
Previous
Next Post »
0 Komentar

Google Tags