Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Vindam nerchukundam IRI 17th-21th september programme details

Vindam nerchukundam IRI 17th-21th september programme details


"విందాం - నేర్చుకుందాం".. తేదీ : 20-09-2019 నాటి రేడియో పాఠం
★ విషయం : గణితం
★ పాఠం పేరు : "తీసివేత (వ్యవకలనం)"
★ తరగతి : 3వ తరగతి
★ సమయం : 11 AM
★ నిర్వహణ సమయం : 30 ని.లు

బోధనా లక్ష్యాలు, బోధనాభ్యసన సామాగ్రి, కృత్యాలు, ఆట, పాట...

Download...20th September IRI Programme details


"విందాం - నేర్చుకుందాం".. తేదీ : 18-09-2019 నాటి రేడియో పాఠం
 ★ విషయం : తెలుగు
★ పాఠం పేరు : "తొలకరి చిరుజల్లులు"
★ తరగతి : 3వ తరగతి
★ సమయం : 11 AM
★ నిర్వహణ సమయం : 30 ని.లు
బోధనా లక్ష్యాలు, బోధనాభ్యసన సామాగ్రి, కృత్యాలు, ఆట, పాట...
తొలకరి చిరుజల్లులు
✡ బోధనా లక్ష్యాలు:
విద్యార్థినీ విద్యార్థులు :
• సంభాషణల ద్వారా పాఠ్యాంశాన్ని అవగాహన పరచడం
• గేయాన్ని రాగ యుక్తంగా పాడించడం, అభినయింప చేయడం.
• పిల్లల్లో దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించడం .
• విన్న, చదివిన అంశంపై ప్రశ్నలకు సమాధానాలు చెప్పించడం
• పాఠ్యసారాంశాన్ని సొంత మాటల్లో చెప్పించడం, రాయించడం
• పిల్లలు రెండు, మూడు అక్షర పదాలు చెప్పగలుగుతారు. అచ్చులు, హల్లులను గుర్తించి,చెప్పగలుగుతారు.
• పాటద్వారా పాఠ్యసారాంశాన్ని అర్థంచేసుకొని, పాటను సొంతంగా పాడుతారు.
✡ బోధనాభ్యసన సామగ్రి:
• పాఠ్య పుస్తకాలు
• తెల్లకాగితాలు, పెన్నులు, పెన్సిల్లు
• నోటు పుస్తకాలు
• 9 తెల్లకాగితపు చీటీల పై అంటే మొదటి 3 చీటీలపై ఓ రెండు అక్షర పదాలు' అని తరువాత 3చీటీ లపై మూడు అక్షర పదాలు' తరువాత 3 చీటీలపై నాలుగు అక్షర పదాలు' అని రాయాలి. ఆటలో ఉపయోగించాలి.
• 10 కాగితపు చీటీలు/తీసుకోవాలి మొదటి 5 చీటీలపై అచ్చు అక్షరాలు ఒక్కొక్క చీటిపై ఒక్కొక్క అక్షరం రాయాలి. మిగతా 5 చీటీలపై హల్లు అక్షరాలు ఒక్కొక్క చీటిపై ఒక్కొక్క హల్లు అక్షరం రాయాలి ఆటలో ఉపయోగించాలి.
• పాట రాసి ఉంచిన చార్టు.
✡ బోధనాభ్యసస కృత్యాలు :
ప్రసార పూర్వక కృత్యాలు :
కార్యక్రమంలో నిర్వహించబోయే “ఆట” ఆడించే విధానంపై అవగాహన కలిగియుండాలి.
ఆట:
పరిగెడుదాం - పదాలు  చెబుదాం
• రేడియో టీచర్ సూచనలు పాటిస్తూ, ఆటను ఆడించాలి
• పిల్లలను వృత్తాకారంగా నిల్చోమనాలి.
• రేడియో టీచర్ సూచనల ప్రకారం చేయాలి.
ఉదా : మ్యూజిక్ వచ్చినపుడు -ముందుకు దూకండి అంటే ముందుకు దూకాలి వెనకకుదూకండి అంటే వెనకకు దూకాలి.
• మ్యూజిక్ వచ్చినంత సేపు ఉన్న చోటే పరిగెత్తుతున్నట్లు నటించాలి.
• మ్యూజిక్ ఆగిపోగానే ఆపివేయాలి. టీచర్ చెప్పిన విద్యార్థి వృత్తంలో ఉన్న చీటి తీసి, అందులో అడిగిన విధంగా సమాధానం చెప్పాలి.
ఉదా: 1. పదాలు చెప్పడం 2. అచ్చులను, హల్లులను గుర్తించడం
✡ కృత్యాలు : కార్యక్రమంలో నిర్వహించబోయే కృత్యాలపై అవగాహన కలిగి ఉండాలి.
Segment 4
కృత్యము :1:
సంభాషణల అవగాహనపై - పరిశీలన
* రేడియో టీచర్ అడిగే ప్రశ్నలకు, తరగతిలోని విద్యార్థులతో సమాధానం చెప్పించాలి. లత,” రాజు’ లు చెప్పే సమాధానాలను వినేలా చూడాలి.
కృత్యము :2:
గేయ పంక్తులను చదవడం- ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం.
* పాఠ్యపుస్తకంలో 2 వ పేజిలో గల గేయంలోని మొదటి మూడు భాగాలను పిల్లలందరూచదివేలా చూడాలి.
* రేడియో టీచర్ అడిగే ప్రశ్నలకు విద్యార్థులతో సమాధానాలు చెప్పించాలి
కార్యక్రమములో ప్రసారమయ్యే పాటను చార్డుపై స్పష్టంగా రాసి తరగతి గదిలో ప్రదర్శించాలి.
 పాట (పాఠం పై గేయం):
పల్లవి :
కిలకిల మను పిల్లలం!
తొలకరి చిరుజల్లులం!
అల్లరితో ఎల్లరినీ
అలరించే పిల్లలం!  //కిల కిల మను//
 చరణం 1:
తెలుగు తల్లి తోటలోని
వెలుగు లీను పువ్వులం
భారతి చిరు పెదవులపై
పరవశించు నవ్వులం  //కిల కిల మను//
 చరణం 2:
భరతమాత హారంలో
మెరియుచున్న రవ్వలం
రత్నగర్భపదములపై
రవళించే మువ్వలం  //కిల కిల మను//
చరణం 3:
మంచితనం మనసులలో
పంచి పెట్టు గువ్వలం
భారతమ్మ బొమ్మరిండ్ల
పాలు పెరుగు బువ్వలం  //కిల కిల మను//
✡ పాట ప్రసార సమయంలో
• మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.
• రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.
"విందాం - నేర్చుకుందాం".. తేదీ : 17-09-2019 నాటి రేడియో పాఠం
★ విషయం : గణితం
★ పాఠం పేరు : "సమాన భాగాలు-సమాన సమూహాలు"
★ తరగతి : 4వ తరగతి
★ సమయం : 11 AM
★ నిర్వహణ సమయం : 30 ని.లు

బోధనా లక్ష్యాలు, బోధనాభ్యసన సామాగ్రి, పూర్వకృత్యాలు, ఆట, పాట...
✡ బోధనా లక్ష్యాలు:
విద్యార్థినీ విద్యార్థులు :
• ఇచ్చిన వస్తువులను సమాన సమూహాలుగా విభజించగలుగుతారు.
• భాగించడం ద్వారా సులభంగా సమాన సమూహాలుగా మార్చవచ్చని అవగాహన చేసుకుంటారు.
• విభాజ్యం, విభాజకం, భాగఫలం, శేషంల గురించి అవగాహన చేసుకుంటారు.
• భాగహారం అంటే ఆవర్తన వ్యవకలనం అనీ  గుణకారం ద్వారా భాగహారాన్ని సరిచూసుకోవచ్చని తెలుసుకుంటారు.
• నిత్యజీవిత సంఘటనలకు భాగహరాన్ని అన్వయించుకుంటారు.
• ఆట, పాటల ద్వారా శారీరక, మానసికోల్లాసాలు పెంపొందించుకుంటారు.
✡ బోధనాభ్యసన సామగ్రి:
• పాఠ్యపుస్తకం,
• పాఠ్యపుస్తకం 62 వ పేజీలోని “అ” చిత్రం గీచిన చార్ట్.
• 63 వ పేజీలోని “ఇ” చిత్రం గీచిన చార్ట్.
• పాట రాసి ఉంచిన చార్ట్.
✡ బోధనాభ్యసస కృత్యాలు :
ప్రసార పూర్వక కృత్యాలు :
కార్యక్రమంలో నిర్వహించబోయే “ఆట” ఆడించే విధానంపై అవగాహన కలిగియుండాలి.
ఆట:
• తరగతి గదిలో పిల్లలందరూ నిలబడగలిగే విధంగా పెద్ద వృత్తం గీయాలి.
• మ్యూజిక్ వినిపించినంత సేపు పిల్లలందరూ వృత్తం చుట్టూ పరుగెత్తాలి.
• మ్యూజిక్ ఆగిపోగానే పిల్లలు తిరగడం ఆపాలి.
• రేడియో టీచర్ సూచించిన విధంగా పిల్లలందరూ సమూహాలుగా ఏర్పడాలి. చెప్పిన సంఖ్య ప్రకారం వరుసలలో నిలబడాలి.
✡ కృత్యాలు : కార్యక్రమంలో నిర్వహించబోయే కృత్యాలపై అవగాహన కలిగి ఉండాలి.
కృత్యము :1:
• 9 బంతులను ఇద్దరికి సమానంగా పంచినప్పుడు విభాజకం, విభాజ్వం, భాగఫలం, శేషం ఎంతెంతో తరగతిలోని పిల్లలచే
చెప్పించాలి.
• 24 కొవ్వొత్తులను 8 ప్యాకెట్లలో ఉంచితే ఒక్కొక్క ప్యాకెట్లో 3 ఉంటాయి. దీనిని గుణకార రూపంలో పిల్లలచే చెప్పించాలి.
కృత్యము :2:
తరగతిలోని పిల్లలందరినీ రెండు సమూహాలుగా విభజించాలి.
• 62 వ పేజీలోని "అ" చిత్రం గీచిన చార్టును ప్రదర్శించాలి.
• ఒక్కొక్క విద్యార్థిని పిలిచి ఆ చిత్రంలోని ఏమిటి ? ఎన్ని ఉన్నాయి? చిత్రంలో ఎన్ని అడ్డువరుసలున్నాయి ఒక్కొక్క
వరుసలో ఎన్ని ఉన్నాయి? పిల్లలచే చెప్పించాలి.
• పైన చూపించిన చిత్రాన్ని భాగహార రూపంలో పిల్లలచే చేయించాలి.
• 63వ పేజీలోని “ఇ” చిత్రం గీసిన చార్డును ప్రదర్శించాలి.
• ఒక విద్యార్థిచే అవేమిటి? ఎన్ని ఉన్నాయో చెప్పించాలి.
• మరొక విద్యార్థి చేత అడ్డువరుసలెన్నొ చెప్పించాలి.
• మరొక విద్యార్థి చేత అడ్డువరుసలో ఎన్ని ఉన్నాయో చెప్పించాలి.
• పైన చూపించిన చార్టులోని చిత్రాన్ని భాగహార రూపంలో రాయించాలి.
• మరొక విద్యార్థి చేత ఆ భాగహారాన్ని గుణకారం ద్వారా సరిచూడమనాలి.
• రేడియో టీచర్ సూచించిన భాగహారం చేయించి, విభాజ్యం, విభాజకం, భాగఫలం,శేషాలను పిల్లలచే చెప్పించాలి.
కృత్యము :3:
ఆటలో భాగంగా రేడియో టీచర్ సూచనలను అనుగుణంగా పిల్లలందరూ వరుసకు నలుగురు చొప్పున, 2 వరుసలోని సమానంగా, వరుసలో ఆరుగురు చొప్పున, 4 వరుసలలో సమానంగా ఇలా ఒక్కొక్కసారి ఒక్కోవిధంగా నిలబడాలి.
పాట (పాఠం పై గేయం):
పల్లవి :
బాలల్లారా మనమంతా - భాగహారము నేర్వాలి
సమానంగా పంచాలంటే - భాగహారము చెయ్యాలి  //బాలల్లారా //
 చరణం 1:
భాగించాల్సిన సంఖ్యను మనము - విభాజ్యమని అంటాము
ఏ సంఖ్యతో మనము భాగిస్తాము - విభాజకమని దాన్నంటాము
భాగించగ వచ్చిన ఫలితాన్ని - భాగఫలమని అంటాము
మిగిలిపోయిన మొత్తాన్ని - శేషం అని మనమంటాము   //బాలల్లారా //
చరణం 2:
పొలాలనైనా స్థలాలనైనా - సమూహంలో పిల్లలనైనా
పండ్లూ ఫలాలు వస్తువులైనా - పంచవలసిన సొమ్మెంతైనా
ఎక్కువ తక్కువ లేకుండా - సమభాగాలుగా చేయాలంటే
భాగహారము చెయ్యాలి - గుణకారంతో సరిచూడాలి  //బాలల్లారా /
✡ పాట ప్రసార సమయంలో
• మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.

• రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.
Previous
Next Post »

1 comment

Google Tags