=======================
ప్రపంచ హృదయ దినోత్సవం (World Heart Day - వరల్డ్ హార్ట్ డే) ను ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబరు 29 న జరుపుకుంటారు. ఈ దినోత్సవమును ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ లు సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఈ రోజున ప్రతి ఒక్కరు గుండెజబ్బులపై అవగాహన పెంచుకొని గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
Themes:
2025: Don't Miss a Beat
2024: Use Heart for Action
2023: Use Heart, Know Heart
2022: Use Heart for Every Heart
2021: Use Heart to Connect
2020: Use Heart to Beat CVD
2019: Power your Life
2018: My Heart – Your Heart’
2017: Share the Power
ఆరోగ్యకరమైన గుండెకు చిట్కాలు:
1. మీ బరువును ఆరోగ్యకరంగా
ఉంచుకోండి.
2. బాడీమాస్ ఇండెక్స్ (BMI) 24 లోపు ఉంచుకోవాలి.
3. వారానికి కనీసం 150 ని. వ్యాయామం , రోజుకి కనీసం 30 ని. వ్యాయామం (వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ లేదా సైక్లింగ్ ఏదైనా) వారంలో కనీసం ఐదు రోజులు వ్యాయామం
చేయాలి. రోజుకి 15 ని. చెమటలు పట్టే బ్రిస్క్ వ్యాయామం
చేయాలి.
4. ప్రతిరోజు పుష్కలంగా
పండ్లు, కూరగాయలు తినాలి. రోజుకి 160
గ్రాముల నుండి 400 గ్రాముల వరకు పండ్లు లేదా కూరగాయలు తప్పక
తినాలి.
5. ఉప్పును బాగా
తగ్గించండి. ఒక మనిషి ఒక రోజు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు
తినకూడదు.
6. క్రొవ్వు పదార్థములు
మరియు పంచదార వీలైనంత తక్కువగా తినాలి.
7. పండ్లను పండ్ల రూపంలోనే
తినడం మంచిది. పండ్లరసాలు త్రాగేటట్లయితే పంచదార కలపకుండా తీసుకోవాలి.
8. డాల్డా, నెయ్యి లేదా పామాయిల్ ఉన్న ఆహార పదార్థాలు, కేకులు,
పిజ్జాలు, బర్గర్లలో హానికర కొవ్వులు
(హైడ్రోజనేటెడ్ కొవ్వులు మరియు సాచ్యురేటెడ్ కొవ్వులు) ఎక్కువగా ఉండును కనుక
వీటిని తీసుకోకపోవడం మంచిది.
9. నూనెలలో ఆలివ్ ఆయిల్,
రైస్ బ్రాన్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ లేదా
నువ్వుల నూనె వాడాలి. చేపలలో ఉండే నూనె ఆరోగ్యానికి మంచిది.
10. బయట కొనే ఆహారం వీలైనంత
వరకు తగ్గించండి. ఇంట్లో వండిన ఆహారం ఆరోగ్యానికి చాలా మంచిది.
11. ధూమపానం మానండి.
ప్రక్కనవారు ధూమపానం చేస్తున్నప్పుడు వచ్చే పొగ పీల్చిన (పాసివ్ స్మోకింగ్) ఆరోగ్యానికి
హాని జరుగుతుంది. పొగత్రాగడం మానిన తర్వాత 15 సం. లకు మీ
రిస్క్ పూర్తిగా తగ్గుతుంది.
12. కెఫీన్ మోతాదును
తగ్గించండి. రెడ్ బుల్ వంటి కార్బోనేటెడ్ డ్రింక్స్ లో అలాగే కాఫీ మరియు టీ లలో
కెఫీన్ ఉంటుందని గుర్తుంచుకోండి.
13. మద్యపానం అతిగా
సేవించకండి. రోజుకు పరిమిత మోతాదుకు మించకుండా చూసుకోండి.
14. సాధ్యమైనంత వరకు
ఒత్తిడికి దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులందరితో ఆప్యాయంగా, ప్రేమగా
ఉండి గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుంది.
15. క్రమం తప్పకుండా బ్లడ్
ప్రెజర్, బ్లడ్ షుగర్, బ్లడ్
కొలెస్ట్రాల్ లెవల్స్ ఎంత ఉన్నాయో తెలుసుకోండి. వాటిని వీలైనంతవరకు అదుపులో
ఉంచుకున్నట్లయితే గుండెను ఆరోగ్యంగా ఉంచు కోవచ్చు.
16. నెలకు 100 కి.మీ. తగ్గకుండా నడవడం.
Blood Pressure:
Systolic BP 100 కి దగ్గరగా
Blood Sugar:
Fasting Sugar 100 లోపు
Blood Cholesterol:
LDL cholesterol 100 లోపు Maintain
చేస్తే మీరు 100 సం.లు ఆరోగ్యంగా ఉండే అవకాశం
ఎక్కువ (Rule of 100's).
=======================
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల
ప్రకారం ఈ వివరాలను అందించాం.
=======================



0 Komentar