Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

112 India Android APP

112 India Android APP


112 ఇండియాగురించి
మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు, వారు ఇబ్బందుల్లో ఉంటే వెంటనే స్పందించేందుకు ఈ ఏడాది జనవరి 19న కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఏకీకృత 112ఫోన్‌ నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. దాంతోపాటు 112 ఇండియా మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించారు. అమెరికాలో 911 ఎలాగో భారత్‌లో 112 అదే విధంగా ఎమర్జెన్సీ సేవలను అందిస్తుంది.
112 ఇండియాయాప్‌
ఎవరైనా ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని కష్ట సమయంలో అందులోని బటన్‌ను ప్రెస్‌ చేస్తే ఎమర్జెన్సీ సర్వీసులకు సమాచారం అందుతుంది. ఎలాంటి వాయిస్‌ కాల్‌ లేకుండానే సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని బాధితురాలి చెంతకు పోలీసులు చేరుకుంటారు. అందులోని ప్రత్యేక సదుపాయాన్ని షౌట్‌(shout) అని అంటారు. దీనికి మీరు చేయాల్సిందల్లా...  యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని మొబైల్‌ నెంబరు, ఓటీపీతో లాగిన్‌ అవ్వడమే.
ఇలా వాడాలి...
యాప్‌ ఓపెన్‌ చేసి లాగిన్‌ అవ్వగానే... జీపీఎస్‌ సాయంతో మొబైల్‌ స్క్రీన్‌ పై మీరున్న ప్రాంతం కనిపిస్తుంది. స్క్రీన్‌ దిగువన నాలుగు అంశాల బ్లాక్‌ ఉంటుంది. అందులో పోలీస్‌, ఫైర్‌, మెడికల్‌, అదర్స్‌ అని నాలుగు ఆప్షన్లు ఉంటాయి. మీకు కావాల్సిన ఐకాన్‌ను క్లిక్‌ చేస్తే... సమాచారం పంపాలా? అని పాప్‌అప్‌ విండో వస్తుంది. దాన్ని ఓకేచేస్తే మీరున్న ప్రాంతం, మీ మొబైల్‌ నెంబరు తదితర వివరాలు పోలీసులు/సంబంధిత విభాగాలకు చేరిపోతాయి.
గూగుల్‌ ఈఎల్‌ఎస్‌..?
112 ఇండియా యాప్‌ గూగుల్‌ ఈఎల్‌ఎస్‌ సాంకేతికత ఆధారంగా పని చేస్తుంది. ఈఎల్ఎస్‌ అంటే ఎమర్జెన్సీ లోకేషన్‌ సర్వీస్. గూగుల్‌ ఈఎల్‌ఎస్‌ ద్వారా మన లోకేషన్‌ వెంటనే ఎమర్జెన్సీ సర్వీసులకు చేరిపోతుంది. గూగుల్‌ ఈఎల్ఎస్‌ అక్షాంశం, రేఖాంశాల సాయంతో లోకేషన్‌కు కేవలం 5 నుంచి 50 మీటర్ల వరకు వ్యత్యాసంతో సంకేతాలు అందుతాయి.  దీంతో స్పందించి ఘటనాస్థలానికి వెంటనే చేరుకోవచ్చు. ఫీచర్‌ ఫోన్లు (సాధారణ ఫోన్లలోనూ 112 సేవలు పొందవచ్చు. దీని కోసం ఆ నంబర్‌ను అందుబాటులో ఉంచాలని ఫోన్ల తయారీదారులకు ప్రభుత్వం సూచించింది. వరుసగా మూడు సార్లు పవర్‌ బటన్‌ను నొక్కినా, 5 లేదా 9 నంబర్‌ను లాంగ్‌ ప్రెస్‌ చేసినా 112కు కాల్‌ వెళ్లేలా సాధారణ ఫోన్లను తయారు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని మొబైళ్లలో ఈ సదుపాయం ఉంది.
స్వచ్ఛందంగా కూడా...
ఈ యాప్‌లో మీరు కూడా స్వచ్ఛందంగా సేవలు అందించవచ్చు. అంటే ఎవరైనా బాధితులు ఈ యాప్‌ ద్వారా సాయం కోరితే దగ్గరలోని వలంటీర్లకు కూడా సమాచారం చేరుతుంది. దీని కోసం ఏదైనా మీ ధ్రువీకరణ పత్రాన్ని యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. యాప్‌ టీమ్‌ దానిని పరిశీలించి మీకు వలంటీర్‌గా అవకాశం ఇస్తుంది. పోలీసులు చేరుకునేలోపు సమయం వృథా కాకుండా వెంటనే ఆపద నుంచి సదరు బాధితులను కాపాడవచ్చు.
నోట్‌: మీ ఫోన్‌లో జీపీఎస్‌ ఆన్‌లో ఉంటేనే ఈ సర్వీసులను మీరు పొందగలరు.

Previous
Next Post »
0 Komentar

Google Tags