Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School Assembly 23rd December Information

School Assembly 23rd December Information

నేటి ప్రాముఖ్యత
జాతీయ రైతు దినోత్సవం
(భారతదేశ 5వ ప్రధానమంత్రి, 'భారతదేశపు రైతుల విజేత' గా గుర్తింపుపొందిన చౌదరి చరణ్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారు.)
చరిత్రలో ఈ రోజు
13 వ మొఘల్ “చక్రవర్తి అహమ్మద్ షా బహదూర్” 1725సం.లో జన్మించారు.
1912సం. లో రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చే సందర్భంగా జరిగిన సంబరాలలో వైస్రాయి ‘లార్డ్ హర్డింగ్’ పై జరిగిన హత్యాప్రయత్నం ఢిల్లీ-లాహోర్ కుట్రగా చరిత్రకెక్కింది.
భారత దేశ 5 వ ప్రధానమంత్రి “చరణ్ సింగ్” 1902సం.లో జన్మించారు.
పూర్వ భారత ప్రధానమంత్రి “పి.వి.నరసింహారావు” 2004సం.లో మరణించారు.
మంచిమాట
"విజయం మనిషిలో గర్వం అనే అగ్నిని రాజేస్తేఆ తర్వాత అది విజేత దుఃఖానికి కారణం అవుతుంది"
"You must follow every topic you want to say and then teach others that such motivation can produce amazing results"
మన సామెతలు/జాతీయములు
కళ్లు అప్పగించి చూస్తున్నాడు

వివరణ: తదేకంగా చూస్తున్నాడు అని అర్థం. ఉదా: అక్కడ కోడెలు పోట్లాడుకుంటే ఆ పిల్లలు కళ్ళప్పగించి చూస్తున్నారు అని అంటుంటారు.
మంచి పద్యం
కరుడు కట్టిన గుండెలైనా
కరుగుతై కన్నీటి ధారకు
బండలా నిల్చున్న దేవుని
నమ్ముకున్నవ హసీఫా...!
నేటి జీ.కె
ప్రశ్న: రెండో మాధవవర్మ కీసరలో నిర్వహించిన యజ్ఞం ఏది?
జ: పురుషమేధం


వార్తలలోని ముఖ్యాంశాలు
నేడు కడప ఉక్కు కర్మాగారానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.  రూ.15 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో ఏడాదికి 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నారు.
పల్లె ప్రగతి కార్యక్రమాల పనితీరును పరిశీలించేందుకు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రత్యేక బృందాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పల్లె ప్రగతి కార్యక్రమాలను ఈ ప్రత్యేక బృందాలు పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంటల బీమా కోసం పంట సాగు దారులందరికీ 100% బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించి.. పరిహారం సొమ్మును వారి ఖాతాలకు చెల్లించే బాధ్యతను ప్రభుత్వమే చేపట్టనున్నది. దీని కోసం ఏపీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ను రూ.101 కోట్లతో ఏర్పాటు చేయనున్నది.
66వ సౌత్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల ప్రధానోత్సవం లో 2018 ఏడాదికిగానూ “రంగస్థలం” చిత్రానికి సంబంధించి “రామ్‌చరణ్‌” ఉత్తమ నటుడిగా, “మహానటి” ఉత్తమ చిత్రంగా, అదే చిత్రానికి సంబంధించి “కీర్తి సురేశ్‌” ఉత్తమ నటిగా అవార్డులు సొంతం చేసుకున్నారు.
జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ)కు సంబంధించి తన ప్రభుత్వం ఇంతవరకు కేబినెట్‌లో కానీ, పార్లమెంట్లో కానీ చర్చించలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అలాగే పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించే ముందు ఆ చట్టంలోని అంశాలపై అవగాహన తెచ్చుకోవాలని సూచించారు.
నేడు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలుబడనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లోకి ప్రవేశించాలన్న లక్ష్యంతో నింగిలోకి దూసుకెళ్లిన బోయింగ్‌ కంపెనీ స్టార్‌లైనర్‌ క్రూ క్యాప్సూ్యల్‌ డమ్మీ అంతరిక్ష నౌక అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లకుండానే న్యూమెక్సికోలోని ఎడారిలో సురక్షితంగా ల్యాండైంది.

వెస్టిండీస్‌తో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించింది. దీంతో ఆ జట్టుపై వరుసగా పది సిరీస్‌లు గెలిచి చరిత్ర సృష్టించింది. 316 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయి 48.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.
Previous
Next Post »

3 comments

Google Tags