Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Acceptance of SCERT recommendations on English medium

Acceptance of SCERT recommendations on English medium

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై SCERT నివేదిక ఇచ్చింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 6 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని SCERT సూచించింది. అయితే, మైనారిటీ పాఠశాల లు యధావిధిగా కొనసాగుతాయి. ఒకవేళ అక్కడ ఎవరన్నా ఇంగ్లీష్ మీడియం కోరితే.... ప్రత్యేక సెక్షన్ ఏర్పాటు చేయాలని SCERT సూచించింది.

తెలుగు మీడియం వైపు మొగ్గు చూపే వారికోసం మండలానికి ఒక స్కూల్ చొప్పున 672 తెలుగు మీడియం స్కూల్స్ ఏర్పాటు చేయావచ్చని నివేదికలో పేర్కొంది. అయితే, తెలుగు మీడియం కోరిన విద్యార్థులకు ఉచిత రవాణా ఖర్చును విద్యార్థులకు చెల్లించాలని విద్యాశాఖ కమిషనర్ పేర్కొన్నారు. SCERT రిపోర్టుతో పాటు, పాఠశాల విద్యా కమిషనర్ సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంటూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, సుప్రీం కోర్ట్ ఇచ్చే తీర్పు ప్రకారమే ఇంగ్లీష్ మీడియం పై తుది నిర్ణయం తీసుకుంటామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
School Education Department – Medium of instruction – Seeking the advice from the SCERT / State Academic Authority – Recommendations furnished – Acceptance of the recommendations of the SCERT– Orders– Issued.
G.O.Ms.No.24 Dt: 13/5/2020

Previous
Next Post »
0 Komentar

Google Tags