Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Amazon announces 20000 new jobs in india

అమెజాన్‌లో 20వేల ఉద్యోగాలు

ఈ-కామర్స్‌ దిగ్గజం ఆమెజాన్‌ భారత్‌లో సుమారు 20వేల తాత్కలిక ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్టు ఆదివారం పేర్కొంది. హైదరాబాద్, పుణె, కోయంబత్తూరు, నోయిడా, కోల్‌కతా, జైపూర్, చండీగఢ్, మంగళూరు, ఇండోర్, భోపాల్, లక్నో వంటి 11 నగరాల్లో ఉద్యోగులను నియమించుకోబోతున్నట్టు తెలిపింది. ఈ తాత్కాలిక ఉద్యోగులతో రానున్న ఆరునెలలపాటు వినియోగదారుల అవసరాలు తీర్చడంలో ఇబ్బంది ఉండదని అమెజాన్‌ ఇండియా డైరెక్టర్‌(వినియోగ దారుల సేవా విభాగం) అక్షయ్‌ప్రభు తెలిపారు. 2025 కల్లా ఇండియాలో సుమారు పదిలక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ఈ ఏడాది ఆరంభంలో అమెజాన్‌ ఇండియా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా ఈ చర్యలు చేపట్టారు.
వర్క్ ఫ్రం హోం ఆప్షన్ కూడా ఉందని, పని వేళల్లో సర్దుబాటు చేసుకునే అవకాశం కూడా ఉందని తెలిపింది. దాదాపు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. 12వ తరగతి చదివి ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషలలో నైపుణ్యం ఉన్న వారు అర్హులని వివరించింది.  కంపెనీ వ్యాపార అవసరాలను బట్టి శాశ్వత ఉద్యోగులుగా తీసుకుంటామని అమెజాన్ పేర్కొంది. ఆసక్తిగల అభ్యర్థులు 1800-208-9900 ఫోన్ చేయవచ్చని, అలాగే, seasonalhiringindia@amazon.comకు మెయిల్ చేయవచ్చని తెలిపింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags