Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Heat rash / prickly heat / miliaria

Heat rash / prickly heat / miliaria

చెమటకాయలు
వేసవికాలం వచ్చిందంటే చాలు... మండే ఎండలు, భరించలేని చెమట. ఇది అందరికీ తెలిసినదే. వేడిమి, చెమట... కొన్నిసార్లు ఇవే కాదు... చెమటకాయలూ మొదలవుతాయి. ఈ కాలంలో ఇది చాలామందిని బాధించే సమస్య. పిల్లల్లో మరీ ఎక్కువ. ఇదొక రకమైన చర్మవ్యాధి. వేడిగా ఉండే వాతావరణంలో ఈ సమస్య సర్వసాధారణం. పిల్లల్లో స్వేదగ్రంథులు పూర్తిగా రూపొందకపోవడంతో చిన్నారులలో ఇవి ఎక్కువ. వాటితో కలిగే చికాకూ ఎక్కువే. ఒక్కోసారి వాటిని భరించలేక చిదిపేస్తూ ఉంటారు. ఫలితంగా సమస్య తీవ్రమవుతుంది. శరీరంపై కాసే ఈ కాత... మనం కోరని కాత. కాయకముందే కోయాల్సిన కోత. ఈ కాతను రాల్చాలంటే కేవలం ప్రేమ మాత్రమే చాలదు. కాసిని జాగ్రత్తలు కూడా కావాలి.
చెమట లేదా స్వేదం చర్మం నుంచి ఉత్పత్తి అయ్యే ఒకరకమైన స్రావం. ఇది చర్మంలోని స్వేద గ్రంథుల నుంచి తయారవుతుంది. ఇది ముఖ్యంగా నీరు, వివిధ లవణాలతో కలిసి ఉంటుంది. స్వేదంలో కొద్దిగా యూరియా వంటి మలిన పదార్థాలుంటాయి. అయితే స్వేదానికి దుర్వాసన ఉండకపోయినా, చెమట పట్టడం వల్ల శరీరంపై అభివృద్ధి చెందే ప్రాపియోనీ బ్యాక్టీరియా పెరగడం వల్ల దుర్వాసన వస్తుంటుంది. (ఇలా దుర్వాసన రావడాన్ని బ్రామ్‌హిడరోసిస్ అంటారు). చెమట పట్టడం అనేది ఒక రకంగా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే విధానం. చెమట అధికమయినప్పుడు శరీరం మీద చెమటకాయలు ఏర్పడతాయి. వీటిని వైద్య పరిభాషలో ‘మిలీరియా రుబ్రా’ అంటారు.
చెమటకాయలు ఎలా వస్తాయి?
చర్మంలో ఎక్రైన్ స్వెట్‌గ్లాండ్స్ అనే చెమట గ్రంథులు ఉంటాయి. ప్రతి గ్రంథికి ఎక్రైన్ అనే ఒక నాళం (డక్ట్) ఉంటుంది. మన చర్మంలో సహజంగా స్టెఫలోకాకస్ ఎపిడెర్మిడిస్ అనే బ్యాక్టీరియా ఎప్పుడూ ఉంటుంది. ఈ బ్యాక్టీరియా వల్ల, మృత చర్మ కణాల వల్ల స్వేద రంధ్రాలుమూసుకుపోతాయి. స్వెట్ డక్ట్‌ కు అడ్డుపడి, చెమటకాయలలాగ తయారవుతుంది. ఒక్కోసారి ఈ చెమటకాయలలో చీము కూడా చేరుతుంది. దీనిని‘మిలీరియా పస్టులోసా అంటారు.
ఈ చెమటకాయలను నిర్లక్ష్యం చేస్తే, ఇవి పెద్ద పెద్ద గడ్డలుగా మారే అవకాశం లేకపోలేదు. దీన్ని పెరిపొరైటిస్ స్టెఫిలోజిన్స్అంటారు. సాధారణంగా చెమటకాయలు వచ్చినచోట చెమట పట్టడం తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి చెమట పూర్తిగా ఆగిపోతుంది. ఎందుకంటే పగిలినట్టుగా అయిన స్వేద నాళిక ) పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి కొద్దిరోజులు పడుతుంది. చెమట పట్టకుండా ఆగిపోవడానికి ఇదే కారణం.
ఎవరికి వస్తాయి?
ఇవి పెద్దవాళ్ల కంటే పిల్లలకే ఎక్కువగా వస్తాయి. పుట్టిన బిడ్డ నుంచి సంవత్సరం లోపు వయసున్న పిల్లలలో అప్పుడే ఈ చెమటకాయల సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లలో ఈ స్వేదనాళంపూర్తిస్థాయిలో పనిచేయదు. అంటే అప్పటికి పూర్తిగా అభివృద్ధిచెందదు. అందువల్ల చెమట పట్టినప్పుడు, ఈ నాళిక త్వరగా పగిలినట్టు అయి, చెమట కాయలు వస్తాయి. 
ఇవి క్రింది కారణాల వల్ల వస్తాయి.
>చిన్నపిల్లలకు, పెద్దవారికి
>ఎండలో ఎక్కువగా తిరిగేవారికి
>చల్లటి ప్రదేశాల నుంచి వేడి ప్రదేశాలకు తరలి వెళ్లిన వారికి
>బిగుతుగా ఒంటికి పట్టేసినట్టు ఉండే వస్ర్తాలు ధరించేవారికి
>జ్వరం వచ్చినవారికి
చెమట పడితేనే చికాకుగా ఉంటుంది. అటువంటిది చెమటకాయలు వస్తే? చికాకు రెట్టింపు అవుతుంది. అంతేకాక ఏ పని చేయాలన్నా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే తగు జాగ్రత్తలు తీసుకుని ఈ సమస్యను ముందుగానే నివారించుకోవడానికి ప్రయత్నించాలి. ఎన్ని చేసినప్పటికీ చెమటకాయలు ఎక్కువ బాధిస్తుంటే మాత్రం చర్మవ్యాధుల నిపుణుడిని సంప్రదించడం మంచిది.
ఏయే ప్రదేశాలు
చెమటకాయలు శరీరం మీద చాలా భాగాలలో కనిపిస్తాయి. ముఖం, మెడ, చర్మం ముడత పడే చోట, వస్ర్తాల ఒరిపిడి ఉండే చోట.
పిల్లలలో - వీపు, మెడ, గజ్జలు, బాహుమూలాలలో
పెద్దవారిలో - మెడ, తల, వీపు, బాహుమూలాలలో
జాగ్రత్తలు
కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ చెమటకాయల సమస్యను నివారించుకోవచ్చు.
చెమట ఎక్కువ పట్టకుండా జాగ్రత్త పడాలి
>వేడి వాతావరణం లోకి వెళ్లకూడదు
>చల్లటి ప్రదేశాలు లేదా ఏసి ఉన్నచోట ఉండాలి
>మందంగా ఉండి, శరీరాన్ని చుట్టేసేలాంటి వస్ర్తాలు ధరించకూడదు
>బట్టల ఒరిపిడి లేకుండా చూసుకోవాలి
>సాధ్యమయినంతవరకు పల్చగా ఉండే నూలు వస్ర్తాలు ధరించాలి
>సబ్బును ఎక్కువగా వాడకూడదు
>సన్ స్క్రీన్ లోషన్స్ వాడాలి
>పిల్లలు ఎండలో చెమటపట్టేలాంటి ఆటలు ఆడకూడదు
>ఎక్కువ మంచినీరు తాగుతుండాలి.
చికిత్స
>ప్రిక్లీ హీట్ పౌడర్: ఈ పౌడర్‌లో డ్రయింగ్ మిల్క్ ప్రొటీన్, ట్రైక్లోజాన్, మెంథాల్ అనే పదార్థాలు ఉంటాయి. వీటిలోని మిల్క్‌ప్రొటీన్, ట్రైక్లోజాన్‌లు ఇన్‌ఫెక్షన్‌ని తగ్గిస్తాయి. మెంథాల్ శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తుంది.
>తరచు స్నానం, అంటే రోజుకి మూడు నాలుగు సార్లు చన్నీటి చేస్తుండాలి. సబ్బును ఎక్కువగా వాడకూడదు
>క్యాలమిన్‌ లోషన్‌ను వాడాలి.
>జింక్ ఆక్సైడ్ వాడటం మంచిది
>నిపుణుడైన వైద్యుని సలహా పై, ట్రోపికల్ కార్టికోస్టెరాయిడ్స్ లేదా ట్రోపికల్ యాంటీబయాటిక్స్ వాడాలి.
పైన చెప్పిన వాటిలో మొదటి రెండింటి (క్యాలమిన్ లోషన్, జింక్ ఆక్సైడ్) తో సమస్య తగ్గకపోతే, చర్మవ్యాధుల నిపుణుని (డెర్మటాలజిస్టు) సూచన మేరకు మాత్రమే (ట్రోపికల్ కార్టికోస్టెరాయిడ్స్, టాపికల్ యాంటీబయాటిక్స్) వాడాలి.

Previous
Next Post »
0 Komentar

Google Tags