Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Services Offered in Village and Ward secretaries

గ్రామ, వార్డు సచివాలయాలలో లభించుసేవలు..
స‌చివాల‌యాల్లో ఆల‌యాల అద్దె గ‌దులు బుకింగ్
ఏపీలోకి ప్ర‌ధాన ఆల‌యాల‌కు వెళ్లాల‌నుకునే భ‌క్తులు, అక్క‌డ ఉండ‌టానికి కావాల్సిన‌ అద్దె గదులను గ్రామ, వార్డు సచివాలయాలలోనే అడ్వాన్స్ బుకింగ్‌ చేసుకునే వీలును గ‌వ‌ర్న‌మెంట్ కల్పించింది. మారుమూల గ్రామాలు, పంచాయతీల్లో ఉండే భక్తులు పట్టణాలు, ఇతర ప్రాంతాలకు పోయి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్టు చెబుతోంది. అయితే దీనివల్ల అదనపు ఖర్చులు తగ్గడమే కాక, సమయం సైతం కలిసి వస్తుంది.
శ్రీకాళహస్తి, అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల ఆల‌యాల‌కు సంబంధించిన‌ స్వామి వారి సేవా టికెట్లను కూడా ముందస్తుగా తీసుకోవ‌చ్చు. ఈ సేవలకు సంబంధించిన పూర్తి వివరాలను గ్రామ‌, వార్డు వాలంటీర్లు తమ పరిధిలోని అన్ని ఫ్యామిలీల‌కు వాట్సాప్‌ మెసేజ్‌ల రూపంలో పంపిస్తున్నారు. జూన్‌ 8వ తేదీ నుంచి అన్ని ఆలయాల్లో దర్శనాలు తిరిగి ప్రారంభించ‌డానికి కేంద్ర ప్రభుత్వం ప‌ర్మిష‌న్ ఇచ్చిన‌ నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని దేవాల‌యాల‌కు సంబంధించిన అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా, లాక్ డౌన్ రూల్స్ పాటిస్తూ ద‌ర్శ‌నం చేసుకునేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాలలో మొత్తం 540 రకాల సర్వీసెస్ పొందేందుకు గ‌వ‌ర్న‌మెంట్ తగిన ఏర్పాట్లు చేసింది. వాటిలో  ముఖ్యమైనవి...
ఓటర్‌ ఐడీ అప్లికేషన్, కుటుంబ ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, పట్టాదారు పాస్‌ పుస్తకం, ఎఫ్‌ఎంబీ కాపీ, ఆధార్‌ కేవైసీ, ఎలక్ట్రిక్‌ మీటర్‌ కనెక్షన్, ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్, ఈసీ కాపీ, కొత్త రైస్‌ కార్డు, రైస్‌ కార్డులో కొత్త పేర్ల చేరిక, వివాహ, మరణ ధ్రువీకరణ పత్రాలు, బిల్డింగ్‌ ప్లాన్‌ ఆమోదం, పుట్టిన తేదీ, విద్యార్థి బస్‌పాస్, డ్రైవింగ్‌ లైసెన్స్‌ల స్లాట్‌ బుకింగ్‌ తదితర సేవలు
Previous
Next Post »
0 Komentar

Google Tags