ప్రపంచ కాలేయ
వ్యాధి దినోత్సవం - హెపటైటిస్ - జూలై 28
======================
కాలేయ
వ్యాధిపై ప్రజలలో అవగాహన కలిగించే దిశగా జూలై 28వ తేదీన హెపటైటిస్ నివారణ దినోత్సవం జరుపుకోవాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ
నిర్ణయించింది. హెపటైటిస్-బి వైరస్‌ను కనుగొన్న నోబెల్ బహుమతి గ్రహీత
శాస్త్రవేత్త బారుచ్‌శామ్యుల్ బ్లూమ్‌బర్గ్ గౌరవార్థం ఆయన పుట్టినరోజైన జూలై 28న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, జీవనశైలి తదితర కారణాల వల్ల ఎన్నో వ్యాధులు వస్తున్నాయి. ఇందులో హెపటైటీస్‌వ్యాధి ప్రమాదకరమైంది. దీన్ని నిర్లక్షం చేస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. ఇది శరీరంలోని కాలేయం(లివర్)పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎ, బీ, సీ, డీ,ఈ లుగా వెలుగుచూసే ఈ వ్యాధిలో హెపటైటీస్‌బీ ప్రమాదకరమైందిగా వైద్యులు చెబుతారు. ఈ వ్యాధి తీవ్రత సిర్రోలిక్ దశకు చేరుకుని ఏకంగా కాలేయం పూర్తిగా దెబ్బతింటుంది. ఈ దశలో కాలేయ మార్పిడి చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
హెపటైటిస్-బీ
వ్యాధి లక్షణాలు:
ఈ వ్యాధి
సోకినట్లైతే కాలేయానికి వాపు రావటం, వాంతులు
చేసుకోవటం, పచ్చ కామెర్లు వంటివి ఏర్పడడం
జరుగుతుంది. ఒక వేళ ఈ వ్యాధి ముదిరితే కాలేయం గట్టిపడి లివర్ కాన్సర్ వచ్చే
ప్రమాదం ఉంది. హెపటైటిస్‌బీ వైరస్ ఒకసారి శరీరంలోకి ప్రవేశించిందంటే వెంట వెంటనే
దాని సంఖ్య విపరీతంగా పెరిగి లివర్‌పై ప్రభావం చూపుతుంది. హెపటైటిస్ బీ సోకిన
తొలి దశలో కామెర్లు, వికారం, అన్నం సయించకపోవటం, కొద్దిపాటి
జ్వరం వంటి లక్షణాలూ ఉంటాయి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు ప్రాథమిక
దశలో వ్యాధిని గుర్తిస్తే మందులతో నయం చేయవచ్చు. హెపటైటిస్ ఎ,బీ,సీ,డీ,ఈ అనే వైరస్‌ల ద్వారా ఇది
శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇందులో ఏ,ఈ వైరస్‌లు
కలుషిత నీరు,ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతాయి. బీ,సీలు కలుషితమైన రక్తం శరీరంలోకి ఎక్కించడం మూలంగా ఒకరి
నుంచి మరొకరికి సంక్రమిస్తుంది.
======================
Today is World #Hepatitis Day.
— World Health Organization (WHO) (@WHO) July 27, 2025
Did you know❓ Hepatitis is the second leading infectious cause of death globally, with hepatitis B and C claiming 3 500 lives every day.
Learn how to protect yourself and your loved ones 👉 https://t.co/7MPVpRtY4Q pic.twitter.com/eaUWae2bfu



0 Komentar