Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APPSC exams from September 21, Here are the details ..!


APPSC exams from September 21, Here are the details ..!
ఈనెల 21 నుంచి ఏపీపీఎస్సీ పరీక్షలు.. వివరాలు ఇవే..!
ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో గెజిటెడ్‌ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు సెప్టెంబ‌రు 21 నుంచి జరగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో గెజిటెడ్‌ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు సెప్టెంబ‌రు 21 నుంచి 24వ తేదీ వరకు విజయవాడలో జరగనున్నాయి. జిల్లా కేంద్రాల్లో కాకుండా విజయవాడలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో దూర ప్రాంతాల నుంచి చేరుకోవడం ఇబ్బందిగా ఉంటుందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రోజూ పరీక్షలు రాసే వారి సంఖ్య పరిమితంగానే ఉంటుంది కాబట్టి విజయవాడలోనే జరుపుతున్నామని
ఏపీపీఎస్సీ అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ https://psc.ap.gov.in/ లో చూడొచ్చు.

పరీక్ష తేదీలు:
బీసీ/సోషల్‌/ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ - సెప్టెంబర్‌ 21, 22
రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ (మైనింగ్‌ సర్వీస్‌) - సెప్టెంబర్‌ 23
సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ - సెప్టెంబర్‌ 23
టెక్నికల్‌ అసిస్టెంట్‌ - సెప్టెంబర్‌ 23
అసిస్టెంట్‌ డైరెక్టర్‌ - సెప్టెంబర్‌ 23, 24
అసిస్టెంట్‌ కెమిస్ట్‌ - సెప్టెంబర్‌ 23, 24
టవున్‌ ప్లానింగ్‌ అసిస్టెంట్‌ - సెప్టెంబర్‌ 23, 24

కరోనా సోకి చికిత్స పొందినట్లయితే.. నెగెటివ్‌ రిపోర్టును పరీక్షా కేంద్రాలవద్ద ఇవ్వాలని సూచించారు. మరోవైపు సెప్టెంబ‌రు 20 నుంచి 26 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో 16,208 పోస్టుల భర్తీకి పరీక్షలు జరగనున్నాయి. కొందరు ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలు, సచివాలయ పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేశారు. దీనివల్ల ఏ పరీక్ష రాయాలో తెలియక అయోమయంలో ఉన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags