Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Here are the ways to achieve success in JEE Advanced 2020



Here are the ways to achieve success in JEE Advanced 2020 
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2020లో విజయం‌ సాధించడానికి మార్గాలివే..!
జేఈఈ అడ్డాన్స్‌డ్‌ పరీక్షలో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలను ఓసారి పరిశీలిద్దాం..

జేఈఈ అడ్వాన్స్‌డ్.. ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశానికి మార్గం. ఐఐటీల్లో అడుగు పెట్టాలనుకునే లక్షల మంది విద్యార్థులు.. సెప్టెంబరు 27న జరగబోయే జేఈఈ అడ్వాన్స్‌డ్‌పై శ్రద్ధగా దృష్టిసారిస్తున్నారు. ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో సీటు సాధించాలంటే దీనిలో ర్యాంకు ఆధారమని మర్చిపోకూడదు. ఈ నేపథ్యంలో.. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2020లో ముఖ్యమైన మార్పులు.. పరీక్షలో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలను ఓసారి పరిశీలిద్దాం..

జేఈఈ అడ్వాన్స్‌డ్ ముఖ్య సమాచారం
అర్హత: 2019 లేదా 2020లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. జేఈఈ మెయిన్‌లో ప్రతిభ ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: అక్టోబర్ 1, 1995 తర్వాత జన్మించి ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, పీడబ్ల్యుడీ అభ్యర్థులు అక్టోబర్ 1, 1990 తర్వాత జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్ 12, 2020
దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 17, 2020
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: సెప్టెంబర్ 21, 2020 నుంచి సెప్టెంబర్ 27, 2020
అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 27, 2020 (పేపర్-1: ఉదయం 9 నుంచి 12 గంటల వరకు; పేపర్-2: మధ్యాహ్నం 2:30-5:30)
పరీక్ష ఫలితాల వెల్లడి: అక్టోబర్ 5, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://jeeadv.ac.in/

ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ప్రత్యేకంగా:
ఐఐటీ-ఖరగ్‌పూర్, ఐఐటీ-రూర్కీ, ఐఐటీ (బీహెచ్‌యూ) వారణాసి క్యాంపస్‌లలో అందుబాటులో ఉన్న అయిదేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి.. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ పేరుతో మరో పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ-అడ్వాన్స్‌డ్ ఫలితాల వెల్లడి తర్వాత ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అడ్వాన్స్‌డ్‌లో క్వాలిఫై అయిన వారికి మాత్రమే ఆర్కిటెక్చర్ టెస్ట్ రాసే అర్హత లభిస్తుంది. ఈ పరీక్ష ఒకే పేపర్‌గా మూడు గంటల వ్యవధిలో నిర్వహిస్తారు.

ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ముఖ్య సమాచారం:
రిజిస్ట్రేషన్: అక్టోబర్ 5, 2020 నుంచి అక్టోబర్ 6, 2020 వరకు.
పరీక్ష తేదీ: అక్టోబర్ 8, 2020 (ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు)
ఫలితాల వెల్లడి: అక్టోబర్ 11, 2020

అడ్వాన్స్‌డ్‌కు 2.5 లక్షల మంది:
జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే.. ముందుగా జేఈఈ మెయిన్‌లో స్కోర్ సాధించాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్‌లో స్కోర్ ఆధారంగా టాప్ 2.5 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత లభిస్తుంది. అంటే.. ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించినా.. జేఈఈ-మెయిన్‌లో తప్పనిసరిగా టాప్ 2.5 లక్షల మంది జాబితాలో నిలవాల్సిందే.

మహిళల కోసం 20 శాతం అదనపు సీట్లు:
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మరో ముఖ్యమైన మార్పు.. దేశంలోని అన్ని ఐఐటీల్లో మహిళా విద్యార్థుల కోసం 20శాతం అదనపు సీట్లు(సూపర్ న్యూమరరీ సీట్లు) కేటాయించనున్నారు. ఐఐటీల్లో అందుబాటులో ఉన్న సీట్లకు అదనంగా 20 శాతం సీట్లు మహిళల కోసం పెంచనున్నారు. 2019-20 గణాంకాల ప్రకారం-జాతీయ స్థాయిలో మొత్తం 23 ఐఐటీల్లో నాలుగేళ్ల బీటెక్, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లలో కలిపి మొత్తం 12,463 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా 20 శాతం సీట్లు కేటాయించి.. వీటిని మహిళా విద్యార్థులతో భర్తీ చేస్తారు.

పరీక్ష కేంద్రాల సంఖ్య పెంపు:
ఈ ఏడాది జేఈఈ-అడ్వాన్స్‌డ్ పరీక్ష కేంద్రాలను పెంచారు. కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో 212 నగరాలు/పట్టణాల్లోని సెంటర్లలో పరీక్ష నిర్వహించనున్నారు. గతేడాది కేవలం 171 పట్టణాల్లో మాత్రమే ఈ పరీక్ష జరిగింది. పరీక్ష కేంద్రాల విషయంలో అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తమ ప్రాధాన్యత క్రమంలో ఎనిమిది సెంటర్లను పేర్కొనాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తుల సంఖ్య, మౌలిక సదుపాయాల లభ్యతను పరిగణనలోకి తీసుకొని.. పరీక్ష కేంద్రాన్ని కేటాయిస్తారు. గతేడాది వరకు విదేశాల్లోనూ జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ను నిర్వహించగా.. ఈ సంవత్సరం కొవిడ్ దృష్ట్యా విదేశాల్లో సెంటర్లను ఏర్పాటు చేయలేదు.
  
పరీక్షలో నో ఛేంజస్‌..!
పరీక్ష పరంగా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని.. గతేడాది మాదిరిగానే రెండు పేపర్లుగా పరీక్ష ఉంటుందన్నది నిపుణులు అభిప్రాయం. గతేడాది పేపర్-1, పేపర్-2గా రెండు పేపర్లలో అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించారు. ప్రతి పేపర్ 54 ప్రశ్నలు, 186 మార్కులు చొప్పున 372 మార్కులకు జరిగింది. ప్రతి పేపర్‌లోనూ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 18 చొప్పున ప్రశ్నలు అడిగారు. రెండు పేపర్లలోనూ ఒక్కో సబ్జెక్ట్‌కు 62 మార్కులు కేటాయించారు.

సన్నద్ధత ఇలా:
అడ్వాన్స్‌డ్ పరీక్ష స్వరూపంలో ఎలాంటి మార్పులు లేవు. ఎప్పటి మాదిరిగానే ఆన్‌లైన్ విధానం(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)లో మూడు గంటల వ్యవధిలో మూడు సబ్జెక్ట్‌ల(మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)లో పరీక్ష నిర్వహించనున్నారు. కాబట్టి విద్యార్థులు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల సిలబస్‌పై దృష్టిపెట్టి.. పరీక్ష కోణంలో ప్రిపరేషన్ సాగించాలి.

మ్యాథమెటిక్స్:
కోఆర్డినేట్ జామెట్రీ, డిఫరెన్షియల్ కాలిక్యులస్, ఇంటిగ్రల్ కాలిక్యులస్, మాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్‌తో పాటు 3-డి జామెట్రీ; కో ఆర్డినేట్ జామెట్రీ; వెక్టార్ అల్జీబ్రా; ఇంటిగ్రేషన్; కాంప్లెక్స్ నెంబర్స్; పారాబోలా; ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్; క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్; థియరీ ఆఫ్ ఈక్వేషన్స్; పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్; బైనామియల్ థీరమ్; లోకస్ వంటి అంశాలను ప్రిపేర్‌ కావాలి.

కెమిస్ట్రీ:
కెమికల్ బాండింగ్, ఆల్కైల్ హలైడ్; ఆల్కహాల్స్ అండ్ ఈథర్, కార్బొనైల్ కాంపౌడ్స్, అటామిక్ స్ట్రక్చర్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్ అండ్ థర్మో కెమిస్ట్రీ అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. వీటితోపాటు మోల్ కాన్సెప్ట్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఫినాల్స్, పి-బ్లాక్ ఎలిమెంట్స్, అటామిక్ స్ట్రక్చర్, గ్యాసియస్ స్టేట్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, డీ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్‌పై అవగాహన పెంచుకోవాలి. 

ఫిజిక్స్:
ఎలక్ట్రో డైనమిక్స్, మెకానిక్స్,హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎస్‌హెఎం అండ్ వేవ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. అదే విధంగా సెంటర్ ఆఫ్ మాస్, మూమెంటమ్ అండ్ కొలిజన్; సింపుల్ హార్మోనిక్ మోషన్, వేవ్ మోషన్ అండ్ స్ట్రింగ్ వేవ్స్‌లో లోతైన అవగాహన ఏర్పరుచుకోవాలి.

సూచనలు
స్క్రీన్‌పై ప్రశ్న కనిపించిన వెంటనే సమాధానం రాసెయ్యాలన్న ఆత్రుత వద్దు. ముందు పేపర్‌-1లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో, వాటిలో వేటికి ఎన్ని మార్కులు కేటాయించారో చూసుకోవాలి. అలాగే వేటికి రుణాత్మక మార్కులున్నాయో వేటికి పాక్షిక మార్కులున్నాయో వేటికి లేవో కూడా చూసుకోవాలి. పేపర్‌-2లోనూ ఇదే పద్ధతిని అనుసరించాలి. దీన్ని బట్టి ముందుగా రుణాత్మక మార్కులు లేని సెక్షన్లపై- మూడు సబ్జెక్టుల్లోని ప్రశ్నలపై దృష్టి సారించి, ఆపై మిగతా వాటివైపు వెళ్లాలి. ఆ ప్రశ్నలను అసలు వదిలేయకుండా జాగ్రత్తపడాలి. తరువాత పాక్షిక మార్కులు నిర్దేశించిన సెక్షన్లు, చివరగా రుణాత్మక మార్కులున్న వాటిపై దృష్టిపెట్టాలి.

Previous
Next Post »
0 Komentar

Google Tags