Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

If You Do This In Your Home, The Outside Noise Will Not Disturb Your Sleep



If You Do This In Your Home, The Outside Noise Will Not Disturb Your Sleep
ఇలా చేస్తే బయటి శబ్ధాలు ఇంట్లో వినిపించకుండా ఉంటాయి
మంచి నిద్ర మీ సొంతమవుతుంది
నిద్ర అనేది ప్రతి ఒక్కరికీ అవసరమే. దీని వల్ల మానసికింగా, శారీరకంగానూ హ్యాపీగా ఉంటారు. నిద్రించే విషయంలో అన్ని పర్ఫెక్ట్‌గా ఉండాలి. అప్పుడే మంచి నిద్ర మీ సొంతమవుతుంది. కానీ, కొన్ని సార్లు బయటి శబ్ధాలు మనకి వినిపిస్తూ నిద్ర సరిగ్గా లేకుండా ఉంటుంది. ఇలాంటప్పడు ఏం చేయాలి. అలా వినిపించకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

హాయిగా నిద్రపోవటం అన్నది నిజంగా ఓ గొప్ప వరం. పగలంతా తీరిక లేకుండా పనిచేస్తున్న అవయవాలు చక్కటి నిద్రలో సేదతీరకపోతే మరుసటి రోజు ఉదయానికి శరీరానికి శక్తీ లభించదు. పసిబిడ్డలు పెరిగేందుకు దోహదం చేసే హార్మోన్ నిద్రలోనే వస్త్తుంది. నిద్రపోతేనే చక్కగా ఎదుగుతారని అంటారు. నిద్రకి అంత శక్తీ ఉంది. ఆరోగ్యాన్ని ఇచ్చే నిద్ర పట్టకపోతే అన్నీ అనారోగ్యాలే. ఏ వయసు వారైనా హాయిగా నిద్రపోలేక పోతే ఆ నిద్రలేమి వల్ల తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయి కుంగుబాటుకు గురవుతారు. ఒక అధ్యయనం ప్రకారం మిగతా కారణాల వల్ల వచ్చే డిప్రెషన్స్ కన్నా, నిద్రలేమి వల్ల కుంగుబాటు ఏడురెట్లు ఎక్కువ ఇబ్బంది పెడుతోందని చెబుతోంది. అసలు నిద్రలేకుండా మనిషి 11 రోజులు మించి బతకలేడంటారు వైద్యులు. నిద్ర విలువ తెలుసుకొని, ఇతర వ్యాపకాలతో నిద్రను దూరం చేసుకోవద్దంటారు.

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ 6 నుంచి 8 గంట‌ల పాటు క‌చ్చితంగా నిద్ర‌పోవాల‌ని వైద్యులు చెబుతుంటారు. ఇది నిజ‌మే. నిద్ర త‌గినంత ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. అదే నిద్ర లేక‌పోతే అధికంగా బ‌రువు పెరుగుతారు. డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు వ‌స్తాయి. క‌నుక ప్ర‌తి ఒక్క‌రు నిత్యం సరైన గంట‌ల పాటు నిద్రించాల్సిందే. అయితే, ప్ర‌స్తుత ఉరుకుల ప‌రుగుల బిజీ యుగంలో ప్రతి ఒక్కరూ నిత్యం ఎదుర్కొనే ఒత్తిళ్ల వ‌ల్ల మాన‌సిక స‌మ‌స్య‌ల‌కు గురవుతూ నిద్ర స‌రిగ్గా పోవ‌డం లేదు. కానీ.. కింద తెలిపిన ప‌లు సూచ‌న‌లు పాటిస్తే రోజూ రాత్రి చ‌క్క‌గా నిద్ర పోవ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏంటో తెలుసుకోండి. ఇందులో ముఖ్యంగా రూమ్ క్లైమేట్.. ఇది హాయిగా పడుకోవడానికి బాగా సాయపడుతుంది. మీరు బెడ్‌ రూమ్‌లో కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే హాయిగా, నిద్ర పోవడానికి సాయపడుతుంది .

రూమ్ క్లైమేట్‌లో కలర్స్ కీ రోల్ పోషిస్తాయి. ముఖ్యంగా బెడ్ రూమ్ వాల్ పెయింట్ కలర్ నిద్ర నాణ్యతను బాగా ప్రభావితం చేస్తుందని చాలా మందికి తెలియదు. సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందించడంతో పాటు, సరైన బెడ్ రూమ్ పెయింట్ రంగును ఎంచుకోవడం మానసిక ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది.అలసటతో కూడిన పనుల తర్వాత రెస్ట్ తీసుకునే ప్రదేశం బెడ్‌ రూమ్. దురదృష్టవశాత్తు, చాలా మందికి సరైన వాల్ పెయింట్ కలర్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు. నిజానికి, ప్రతి కలర్‌ డిఫరెంట్. ఒక్కోదానికి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. సరిగ్గా లేని కలర్స్ ఎంపిక చిరాకు తెప్పిస్తుంది. మానసిక స్థితిపై ప్రభావితం చూపుతాయి. బెడ్ రూమ్ గోడపై మెరుస్తున్న షైనీ కలర్స్‌తో ప్రయోగాలు చేయొద్దు. సాఫ్ట్ కలర్స్ బెడ్ రూములకి బాగా సరిపోతాయి. ఇవి మంచి నిద్రకి కూడా సాయపడతాయి.

వాల్ ప్యానలింగ్ అనేది నేడు లేటెస్ట్ ట్రెండ్. హోమ్ డెకరేషన్‌లో ఇది మంచి పాత్రని పోషిస్తాయి. సాఫ్ట్ వాల్ ప్లేట్స్ బెడ్ రూములకు చాలా మంచిది. సాఫ్ట్ ప్లేట్స్ మంచి అనుభూతిని ఆహ్లాదకరంగా ఉంచుతాయి. పడుకునేటప్పుడు శబ్దాలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే, దీని వల్ల నిద్రకు అంతరాయం కలుగుతుంది. అయితే, బెడ్ రూమ్‌కి వాల్ ప్యానలింగ్ చేయించడం వల్ల ఇది బయటి శబ్దాలను కూడా వినపడకుండేలా చేస్తుంది. దీంతో పాటు, గదిని నిశ్శబ్దంగాఉంచి నిద్రించడానికి సరైనదిగా చేస్తుంది. మంచి నిద్రకు వాల్ ప్యానలింగ్ మంచి ఎంపిక.

బెడ్ రూమ్ లో పరిశీలించాల్సిన అంశాల్లో ఫ్లోరింగ్ కూడా ఒకటి. ఎందుకంటే చాలా మంది బెడ్ రూమ్ లో చెప్పులు లేకుండా తిరుగుతారు అయితే అలా కాకుండా బెడ్ రూమ్ లో సాఫ్ట్ కార్పెట్ మంచి ఎంపిక. ఎందుకంటే ఫ్లోర్ కార్పెట్ గదిని నిశ్శబ్దంగా ఉంచడానికి సహాయపడుతుంది. మీరు నడిచినప్పుడు ఫ్లోర్ చల్లగా తగులుతుంది. దీని వల్ల అసౌకర్య అనుభూతి కలుగుతుంది. అందుకే బెడ్ రూమ్ లో ఫ్లోర్ కార్పెట్ మంచి నిద్ర కు ఒక ఎంపిక.

బెడ్ రూమ్ లో ఉండాల్సిన ముఖ్యమైన వస్తువుల్లో విండో బ్లైండ్స్ కూడా ఒకటి. ఇవి బయట నుంచి వెలుతురుని లోపలి ప్రవేశించకుండా సాయపడుతుంది. కానీ ఏదేమైనా, బెడ్ రూమ్‌ని అన్ని సమయాలలో చీకటిగా ఉంచకూడదు. బెడ్ రూమ్‌లో సహజ కాంతిని లోపలికి అనుమతించేలా ఉంచండి. అందుకే కేవలం నిద్రపోవడానికి ముందు విండో బ్లైండ్స్ ని ఉపయోగించండి.

Previous
Next Post »
0 Komentar

Google Tags