Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

No vaccine is 100 % effective. More than 50 is enough: ICMR comments


 No vaccine is 100 % effective. More than 50 is enough: ICMR comments
ఏ టీకా 100 శాతం సమర్థంగా పనిచేయదు.. 50 దాటితే చాలు: ఐసీఎంఆర్ 
ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోన్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్, చికిత్సా విధానంపై ముమ్మర పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీకా సమర్థతపై ఐసీఎంఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ సమర్ధతపై ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ వ్యాక్సిన్ కూడా 100 శాతం సమర్ధవంతంగా పనిచేయదని, 50-100 శాతం ఉంటే దానిని వినియోగించడానికి అనుమతించవచ్చని పేర్కొన్నారు. ‘శ్వాసకోస వ్యాధులకు వినియోగించే ఏ టీకాలూ 100 శాతం సమర్ధతను చూపవు.. భద్రత, వ్యాధినిరోధకత, సమర్ధత ఈ మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.. 50 శాతం సమర్థత చూపిన టీకాను అమోదించాలని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. మేము 100 శాతం లక్ష్యంగా పెట్టుకున్నాం, కానీ టీకా సామర్థ్యం 50-100 శాతం మధ్య ఉంటుంది’ అని అన్నారు.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ టీకా సురక్షితమని, టీకా తీసుకున్న వ్యక్తుల్లో వ్యాధి నిరోధకతను చూపిందని పరిశోధకులు వెల్లడించారు. రెగ్యులేటరీ అధికారులు సైతం భద్రత, సమర్ధతను నిర్ధారించారు. టీకా 100 శాతం సమర్ధతపై కాకుండా ఒక వ్యక్తిని రక్షించే అంశానికి పరిశోధకులు స్థిరపడాలని పేర్కొంటూ సెంట్రల్ డ్రగ్స్ అండ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ఓ) కోవిడ్ -19 వ్యాక్సిన్ల కోసం ముసాయిదా మార్గదర్శకాలు జారీ చేసిన మర్నాడే బలరామ్ భార్గవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ముంబైకి చెందిన నలుగురు ఆరోగ్య కార్యకర్తలకు కోవిడ్ -19 రెండోసారి సోకినట్టు జన్యుశ్రేణిని ఉపయోగించి నిర్ధారించారు. ది లాన్సెట్ మెడికల్ జర్నల్ వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఫలితాలు ప్రకారం.. ఈ నలుగురికీ ముందుతో పోలిస్తే వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. నాయర్ హాస్పిటల్‌లో ముగ్గురు వైద్యులు, హిందూజా హాస్పిటల్‌లో ఓ ఆరోగ్య సిబ్బందికి రెండోసారి వైరస్ సోకింది.

వ్యాక్సిన్ అభివృద్ధిపై సీడీఎస్ఓ ముసాయిదా మార్గదర్శకాల ప్రకారం.. కోవిడ్ -19 వ్యాక్సిన్లను ఆమోదించాలని యోచిస్తోంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన కనీసం 50 శాతం మందికి వ్యాధినిరోధకశక్తిని చూపుతుంది. ఇప్పటి వరకు వివిధ సంస్థల టీకాలు ప్రయోగాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు వెల్లడయ్యాయి. 

విస్తృతంగా పరీక్షించిన కోవిడ్ -19 వ్యాక్సిన్ సమర్ధంగా పనిచేస్తోందని, ప్లేసిబో-నియంత్రిత సమర్థత కనీసం 50% ఉండాలి’ అని సీడీఎస్ఓ మార్గదర్శకాలలో పేర్కొంది. ప్రస్తుతం దేశంలో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా, భారత్ బయోటెక్, జైడస్ కాడిలా వ్యాక్సిన్‌లు మానవ క్లినికల్ దశలో ఉన్నాయి. రష్యా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌కు కూడా త్వరలో అనుమతి లభించనుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags