Special
portal for JEE ADVANCED 2020 registration
JEE
ADVANCED 2020 రిజిస్ట్రేషన్‌కు ప్రత్యేక పోర్టల్.. డైరెక్ట్
లింక్ ఇదే..!
జేఈఈ
అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్‌కు ప్రత్యేక పోర్టల్‌ను ఢిల్లీ ఐఐటీ అందుబాటులోకి
తీసుకువచ్చింది.
అర్హతలకు
సంబంధించిన వివరాలన్నింటిని పాత వెబ్‌సైట్‌లోనే (https://jeeadv.ac.in/)
ఉంచింది. ఆ వెబ్‌సైట్ ఓపెన్ కాకపోవడంతో దరఖాస్తుల మొదటిరోజు
విద్యార్థులు ఇబ్బంది పడాల్సివచ్చింది. దీంతో వెంటనే మరో వెబ్‌సైట్‌ను
అందుబాటులోకి తీసుకువచ్చింది. విద్యార్థులు ఈ వెబ్‌సైట్ (https://jeeadv.nic.in/)
ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.
ఈ
నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్‌కు.. 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం ఇచ్చింది. ఈ నెల 27న నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా మెయిన్‌లో టాప్ 2.5 లక్షల మంది బెస్ట్ స్కోర్ విద్యార్థులనే పరిగణనలోకి తీసుకుంటామని
స్పష్టం చేసింది.
విద్యార్థులకు
జనవరి జేఈఈ మెయిన్‌లో వచ్చిన స్కోర్, ప్రస్తుత జేఈఈ మెయిన్‌లో వచ్చిన స్కోర్ రెండింటిలో ఏది బెస్ట్ అయితే
దాన్నే అడ్వాన్స్‌డ్‌కు పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. ఆ మేరకు కేటగిరీల
కటాఫ్ స్కోర్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఇప్పటికే ప్రకటించింది. ఆయా
స్కోర్ పరిధిలో ఉన్న విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకునేలా
చర్యలు చేపట్టింది.
0 Komentar