Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: Govt started process for recruitment of 6500 Police jobs and Group 1 Schedule Update

AP: Govt started process for recruitment of 6500 Police jobs and Group-1 Schedule Update

ఏపీ: 6500 పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ ప్రారంభం - ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 షెడ్యూల్‌

ఏపీలో పోలీస్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన కార్యాచరణ మొదలైనట్లు తెలుస్తోంది. 

ఇటీవల పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. డిసెంబర్‌లో 6500 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేస్తామని వెల్లడించిన విషయం తెలిసిందే. 

పోలీస్‌ శాఖలో 6500 పోస్టులకు డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ జారీ చేస్తామని.. నాలుగు దశల్లో పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేసిన విషయమూ విధితమే. అయితే.. తాజాగా ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన కార్యాచరణ మొదలైంది. రాష్ట్రంలో జిల్లాలు, నగర పోలీస్ కమిషనరేట్‌ల పరిధిలో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలియజేయాలంటూ ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్‌లకు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఈ పోస్టులకు సంబంధించి డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ జారీ చేసి.. జనవరిలో రిక్రూట్‌మెంట్‌ షెడ్యూల్‌ విడుదల చేస్తారు. కాబట్టి నిరుద్యోగ యువత ఇప్పటి నుంచే అన్ని విధాల సన్నద్ధమయ్యే ప్రయత్నాలు మొదలుపెడితే పోలీస్‌ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. 

29న ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 షెడ్యూల్‌:

వచ్చే నెల రెండు నుంచి జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షను హైకోర్టు వాయిదా వేసిన విషయం విధితమే. ప్రిలిమ్స్ ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లాయని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో విచారణం అనంతరం మెయిన్స్‌ పరీక్షలను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో నవంబర్‌ 2 నుంచి ప్రారంభం కావల్సిన మెయిన్స్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. దీంతో తదుపరి పరీక్షల షెడ్యూల్‌ను ఈనెల 29న విడుదల చేయనున్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags