Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Engineer Jobs in BEL - Chennai

 

Engineer Jobs in  BEL - Chennai

చెన్నైలోని బెల్‌ సంస్థలో ఇంజనీర్‌ జాబ్స్‌.. రాత పరీక్ష లేదు..!

చెన్నైలోని భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ ‌(బెల్‌).. 23 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 

భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖకు చెందిన చెన్నైలోని భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ ‌(బెల్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న 23 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఎల‌క్ట్రానిక్స్, మెకానిక‌ల్, ఫైనాన్స్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, సివిల్‌, హ్యూమ‌న్ రిసోర్సెస్‌ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈనెల 30 దరఖాస్తుకు చివరి తేది. పూర్తి వివరాలకు https://www.bel-india.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. 

మొత్తం ఖాళీలు: 23

ట‌్రెయినీ ఇంజినీర్‌-11

ట్రెయినీ ఆఫీస‌ర్‌-02

ప్రాజెక్ట్ ఇంజినీర్‌-09

ప్రాజెక్ట్ ఆఫీస‌ర్‌-01 

ముఖ్య సమాచారం:

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ(ఇంజినీరింగ్‌), ఎంబీఏ ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభ‌వం ఉండాలి.

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్‌, గ‌త అనుభ‌వం, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: అక్టోబర్‌ 30, 2020.

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/ 

DOWNLOAD NOTIFICATION

Previous
Next Post »
0 Komentar