Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TSRJC CET 2020 Result Released

 


TSRJC CET 2020 Result Released

టి‌ఎస్‌ఆర్‌జే‌‌సి సెట్-2020 ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు (టీఎస్ఆర్ సీ) ప్రవేశ పరీక్ష ఫలితాలను రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ ప్రకటించింది. గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని 35 జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం ఈ నెల 4న ప్రవేశ పరీక్ష జరిగింది. ఎంపీసీలో 1500, బైపీసీలో 1440, ఎంఈసీలో 60 సీట్లకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు. కౌన్సెలింగ్ కోసం ఒక్కో సీటుకు ఇద్దరు అభ్యర్థుల చొప్పున మొత్తంగా 6 వేల మందిని ఎంపిక చేశారు. ఈ నెల 19న ఎంపీసీ, 20వ తేదీన బైపీసీ అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సొసైటీ కార్యదర్శి ఎస్.వేంకటేశ్వర శర్మ తెలిపారు. కౌన్సెలింగ్ కేంద్రాలు, సమయం తదితర వివరాలను ఎంపికైన విద్యార్థులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఫలితాలను tsrjdc.cgg.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags