Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

India stands at 131st place in mobile data speed behind Pakistan, Nepal and Srilanka

 


India stands at 131st place in mobile data speed behind Pakistan, Nepal and Srilanka

మొబైల్ డేటా స్పీడ్‌లో భారత్ స్థానం అధ్వానం.. పాకిస్తాన్ కంటే కింద.. మొదటి స్థానం ఈ దేశానిదే!

మనదేశంలో గత కొద్దికాలంలో మొబైల్ ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే మొబైల్ డేటా వినియోగంలో మాత్రం మనం బాగా వెనకబడి ఉన్నాం. 

ప్రస్తుతం మనదేశంలో ఇంటర్నెట్ వినియోగం చాలా ఎక్కువ అయింది. మొబైల్ డేటా ప్లాన్లు చాలా చవక అవ్వడంతో నెట్టింట్లో హల్‌చల్ చేసేవారు మనదేశంలో చాలా మందే ఉన్నారు. అయితే మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో కూడా మనం ఇదే స్పీడ్‌లో ఉన్నామా? అనే ప్రశ్న వచ్చినప్పుడు మనం తెల్లమొహం వేయాల్సిన నివేదిక ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. ప్రపంచంలో 138 దేశాలకు సంబంధించిన మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ చేస్తే అందులో మనదేశం 131వ స్థానంలో ఉంది. 

ఈ జాబితాలో పాకిస్తాన్, నేపాల్, శ్రీలంకల కంటే మనం వెనకబడి ఉండటం మరీ విషాదకరమైన అంశం. ఊక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ అనే సంస్థ దీనిపై పరిశోధన చేసి నివేదికను విడుదల చేసింది. ఈ జాబితాలో దక్షిణ కొరియా 121 ఎంబీపీఎస్ మొబైల్ డేటా స్పీడ్‌తో మొదటి స్థానంలో ఉండగా, మనం అందులో కేవలం పది శాతం స్పీడుతో.. అంటే 12.07 ఎంబీపీఎస్ వేగంతో 131వ స్థానంలో ఉన్నాం. ఈ విషయంలో ప్రపంచ సగటు 35.26 ఎంబీపీఎస్‌గా ఉంది. ఇక అప్‌లోడ్ స్పీడ్ విషయానికి వస్తే.. ప్రపంచ సగటు 11.22 ఎంబీపీఎస్‌తో ఉండగా, మనదేశంలో సగటు వేగం 4.31 ఎంబీపీఎస్‌గా ఉంది. 

మన పొరుగుదేశాలు శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్‌లు ఈ విషయంలో మనదేశం కంటే ముందున్నాయి. 19.95 ఎంబీపీఎస్ వేగంతో శ్రీలంక ఈ జాబితాలో 102వ జాబితాలో ఉండగా, 17.13 ఎంబీపీఎస్ వేగంతో పాకిస్తాన్ 116వ స్థానంలో, 17.12 ఎంబీపీఎస్ వేగంతో నేపాల్ 117వ స్థానంలో ఉన్నాయి. 

అయితే మనదేశంలో మొబైల్ డేటా ఖరీదు మాత్రం చాలా చవకనే చెప్పాలి. కేవలం 5 డాలర్లు ఖర్చు పెడితే రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా మీకు లభిస్తుంది. అదే మరో డాలర్ ఎక్కువ ఖర్చుపెడితే ఏకంగా 3 జీబీ డేటా కూడా లభిస్తుంది. 

అత్యంత చవకగా ఇంటర్నెట్ లభించడం కూడా మనదేశంలో నెట్ వినియోగం పెరగడానికి ఒక కారణంగా అయితే మీరు రోజుకు 2 జీబీ, 3 జీబీ మొబైల్ ఇంటర్నెట్ వాడటానికి కష్టపడుతున్నా.. హై రిజల్యూషన్ వీడియో, మొబైల్ గేమ్స్ ఆడటానికి వైఫై తప్పనిసరి అవుతుంది. ఎందుకంటే మొబైల్ డేటా వేగం ఒక పరిమితి వరకు మాత్రమే ఉంటుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags