Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Men produce more Covid-19 Antibodies than Women: Portuguese study

 


Men produce more Covid-19 Antibodies than Women: Portuguese study

కోవిడ్-19: 7 నెలల వరకూ యాంటీబాడీలు.. మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ వృద్ధి

కరోనా వైరస్ మహమ్మారి నుంచి కోలుకున్న తర్వాత యాంటీబాడీలు వృద్ధిచెందుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అయితే, ఇవి ఎంతకాలం ఉంటాయనే అంశంపై స్పష్టత లేదు. 

కరోనా వైరస్‌ బారినపడి కోలుకున్న వారిలో యాంటీబాడీలు ఎన్ని రోజులు ఉంటాయనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే, కోవిడ్-19 నుంచి కోలుకున్నవారిలో ఇవి ఏడు నెలల వరకూ ఉంటాయని తాజాగా ఓ అధ్యయనంలో గుర్తించారు. వైరస్ నుంచి కోలుకున్న 90 శాతం మందిలో యాంటీబాడీలు ఏడు నెలల వరకు ఉంటాయని పోర్చుగల్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. అలాగే, యాంటీబాడీల స్థాయికి, వయసుకు ఏమాత్రం సంబంధం లేదని పరిశోధకులు తెలిపారు. 

అయితే, మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే ఎక్కువ యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నట్లు గుర్తించినట్టు పేర్కొన్నారు. ఈ అధ్యయన ఫలితాలను యూరోపియన్‌ జర్నల్‌ ఆఫ్ ఇమ్యునాలజీలో ప్రచురించారు. యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయనే దానిపై ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ మాలిక్యులర్‌ (ఐఎంఎం) శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు. వైరస్‌ నుంచి కోలుకున్న 90శాతం మందిలో 7నెలల వరకూ యాంటీబాడీలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. 

యాంటీబాడీల స్థాయికి, వయస్సుకు సంబంధం లేదని పరిశోధనలో వెల్లడయ్యింది. కానీ, యాంటీబాడీల స్థాయిలో వైరస్‌ తీవ్రత ప్రభావం ఉన్నట్లు తేలిందని పరిశోధకులు తెలిపారు. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో యాంటీబాడీల అధికస్థాయిలో ఉన్నట్లు కనుగొన్నారు. 

‘వైరస్‌ ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి వైరస్‌పై పోరాడటానికి దోహదపడతాయి’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్‌ వోల్దోయెన్‌ వెల్లడించారు. అధ్యయనంలో భాగంగా కోవిడ్-19 హాస్పిటల్స్‌లోని 300 మంది బాధితులు, వైద్య సిబ్బంది, 200 కరోనా నుంచి కోలుకున్న వాలంటీర్లను పరిశీలించారు. 

ఈ ఆరు నెలల క్రాస్-సెక్షనల్ అధ్యయనం ఫలితాలు కోవిడ్-19 లక్షణాల బయటపడిన తర్వాత మొదటి మూడు వారాల్లో యాంటీబాడీ స్థాయిలు వేగంగా పెరగడం, ఊహించిన విధంగానే ఆ తరువాత క్రమేపీ మధ్యస్థాయికి చేరుకున్నాయి. సార్స్-కోవి-2 రోగనిరోధకశక్తి రేఖాంశ విశ్లేషణను మరింత సులభతరం చేయడానికి ఉపయోగించిన పరీక్షల కోసం వివరణాత్మక సమాచారాన్ని తమ పరిశోధన అందజేస్తుందని వెల్డోయెన్ పేర్కొన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags