Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jala Jeevan Mission 100 days campaign in the state

 


Jala Jeevan Mission 100 days campaign in the state 

Taps for schools and government buildings

స్కూళ్లు, ప్రభుత్వ భవనాలకు కుళాయిలు 

 రాష్ట్రంలో జల జీవన్ మిషన్ 100 రోజుల ప్రచార కార్యక్రమం

గ్రామాల్లో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాలు సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నీటి వసతి కోసం కుళాయిల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభించిన జలజీవన్ మిషన్ వంద రోజుల ప్రచార కార్యక్రమం రాష్ట్రంలో అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2021 జనవరి 10 వరకు కొనసాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విద్య, వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలను సమన్వయం చేసుకుంటూ గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. ఉపాధి హామీ, 15వ ఆర్థిక సంఘం నిధులు, ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గ నిధులతో పాటు సీఎస్ఆర్, ప్రజల భాగస్వామ్యంతో ఆయా పనులు చేపట్టాలని సూచించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags