Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jobs in Central Coal Fields (CCL)

 


Jobs in Central Coal Fields

సెంట్ర‌ల్ కోల్ ‌ఫీల్డ్స్‌లో జాబ్స్‌.. ప్రారంభ జీతం రూ.32 వేలు

సెంట్ర‌ల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న జూనియ‌ర్ ఓవ‌ర్‌మెన్ పోస్టుల భ‌ర్తీకి నోటీఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. 

రాంచీలోని సెంట్ర‌ల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్‌) లో ఖాళీగా ఉన్న జూనియ‌ర్ ఓవ‌ర్‌మెన్ పోస్టుల భ‌ర్తీకి నోటీఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 75 పోస్టుల‌ను భ‌ర్తీచేయ‌నుంది. అభ్య‌ర్థుల‌ను రాతప‌రీక్ష ద్వారా ఎంపిక‌చేస్తారు. ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తులు సీసీఎల్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నవంబర్‌ 11 దరఖాస్తుకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://www.centralcoalfields.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. 

మొత్తం పోస్టులు: 75

అర్హ‌త‌: ఓవ‌ర్‌మెన్ స‌ర్టిఫికెట్ క‌లిగి ఉండాలి. గ్యాస్ టెస్టింగ్‌, ఫ‌స్ట్ ఎయిడ్ స‌ర్టిఫికెట్ త‌ప్ప‌నిస‌రి.

వయసు: అభ్య‌ర్థులు 18 నుంచి 30 ఏళ్ల లోపు వారై ఉండాలి.

ఎంపిక ప్ర‌క్రియ‌: రాత‌ప‌రీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

ప్రారంభ జీతం: రూ. 31,852

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. హార్డ్ కాపీని ప్రింట్‌తీసి అవ‌స‌ర‌మైన స‌ర్టిఫికెట్ల‌ను జ‌త‌చేసి సంబంధిత చిరునామాకు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్ట‌ర్ పోస్టు ద్వారా న‌వంబ‌ర్ 21లోపు పంపించాలి.

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: అక్టోబ‌ర్ 12, 2020

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: న‌వంబ‌ర్ 11, 2020

వెబ్‌సైట్‌: http://www.centralcoalfields.in/

NOTIFICATION

ONLINE REGISTRATION AND APPLICATION

Previous
Next Post »
0 Komentar