Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

October 2 Birth day: Lal Bahadur Shastri, The Man Behind 'Jai Jawan, Jai Kisan’



October 2 Birth day: Lal Bahadur Shastri, The Man Behind 'Jai Jawan, Jai Kisan’
అక్టోబరు 2: భారతదేశ రెండో ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 116వ జయంతి


భారతదేశ రెండో ప్రధానమంత్రి, స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన లాల్ బహాదుర్ శాస్త్రి 116వ జయంతి నేడు. భారతదేశపు నిరాడంబర ప్రధానులలో ఒకరైన లాల్ బహదూర్ శాస్త్రి ఉత్తరప్రదేశ్‌లోని మొఘల్ సరాయ్ గ్రామంలో 1904 అక్టోబర్ 2న జన్మించారు. ఎంతో దేశభక్తిగల ఆయన 1921లో సహాయ నిరాకరణోద్యమంలో అడుగుపెట్టారు. స్వాతంత్య్ర పోరాటంలో మొత్తం 9 సంవత్సరాలపాటు జైలులోనే గడిపారు. స్వాతంత్య్రం అనంతరం ఉత్రప్రదేశ్ రాష్ట్రమంత్రిగా పనిచేసి ఆ తరువాత 1951లో లోక్ సభ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.

మహాత్మా గాంధీ ప్రభావంతో అతను మొదట మహాత్మా గాంధీకి, తరువాత జవహర్‌లాట్ నెహ్రూకు నమ్మకస్తుడైన అనుచరుడయ్యాడు. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత అతను భారతదేశ ప్రభుత్వంలో చేరి జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వంలో మొదట రైల్వే మంత్రిగా (1951–56), తరువాత హోంమంత్రిగానేకాక ఇతర బాధ్యతలను కూడా చేపట్టాడు. నెహ్రూ అనంతరం ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు.

అతను 1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధం కాలంలో దేశాన్ని నడిపించాడు. అతని నినాదం "జై జవాన్ జై కిసాన్" యుద్ధ సమయంలో బాగా ప్రాచుర్యంలోనికి వచ్చి ప్రస్తుత కాలం వరకు ప్రజల హృదయాల్లో గుర్తుండిపోయింది. ఈ యుద్ధం 1966 జనవరి 10న తాష్కెంట్ ఒప్పందం ద్వారా యుద్ధం పూర్తి అయినది. ఒప్పందం జరిగిన తరువాత దినం తాష్కెంట్లో అతను గుండెపోటుతో మరణించినట్లు చెప్పబడింది. కానీ ఈ మరణానికి అనేక కారణాలు చెప్పబడినప్పటికీ అది సి.ఐ.ఎ ద్వారా జరిగిన ప్రణాళికాబద్ధమైన హత్యగా చెప్పబడింది.

కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తూ రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత రవాణా మంత్రిగా, హోంమంత్రిగా పనిచేశారు. 1964లో జవహర్ లాల్ నెహ్రూ ఆకస్మిక మరణం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రిగారు ప్రధానమంత్రి అయ్యారు. దేశం ఆర్ధిక సంక్షోభంలో ఉంటే గ్రీన్ రివల్యూషన్‌కు బాటలు వేశారు. భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఒప్పందం కోసం రష్యా చేరిన లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ ఒప్పందంపైన 1966 జనవరి 10న సంతకాలు చేశారు. ఆ మర్నాడు 1966 జనవరి 11న గుండెపోటుతో తాష్కెంట్‌లోనే ఆయన మరణించారు. మరణానంతరం 1966లో భారత ప్రభుత్వం ఆయనకు 'భారతరత్న' ఇచ్చి గౌరవించింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags