Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

OU PG Final Semester Exam Schedule

 


OU PG Final Semester Exam Schedule

ఓయూ పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్

వర్షాల కారణంగా వాయిదా పడిన పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 27 నుంచి నిర్వహించాలని ఉస్మానియా యూనివర్సిటీ నిర్ణయించింది. ఈ నెల 27 నుంచి నవంబరు 1 వరకు పరీక్షలు నిర్వహించేలా సవరించిన షెడ్యూలును ప్రకటించింది. పరీక్షలు నేటి నుంచి జరగాల్సినప్పటికీ.. వర్షాల కారణంగా వాయిదా పడ్డాయి. మరోవైపు పీజీ ప్రవేశ పరీక్ష.. సీపీజీఈ టీకి ఆలస్య రుసుము లేకుండా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించే గడువు ఈ నెల 29 వరకు పొడిగించినట్లు కన్వీనర్ కిషన్ తెలిపారు. ఓయూ, కేయూ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన, జేఎన్ టీయూహెచ్ లోని ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఐదేళ్ల ఇంటిగ్రేడెట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నవంబరు 6న సీపీజీ ఈ టీ జరగనుంది. ఆలస్య రుసుము రూ.500 చెల్లించి ఈ నెల 29 వరకు, రూ.2 వేల ఆలస్య రుసుముతో నవంబరు 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ తెలిపారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags