India Post Office
Recruitment 2026: Apply for 25,000+ GDS Posts (Schedule-II, July 2026) –
Details Here
తపాలా శాఖలో 25,000+ గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు (షెడ్యూల్-2, జులై 2026) – జీత భత్యాలు: నెలకు రూ.10,000 -
రూ. 29,380
=====================
దేశ
వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 25,000 కి
పైగా గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన (షెడ్యూల్-2, జులై 2026) వెలువడింది. పదో
తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు
మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్
పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో
విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 21 లోగా ఆన్లైన్లో
దరఖాస్తు చేసుకోవాలి.
గ్రామీణ డాక్ సేవక్స్: బ్రాంచ్ పోస్టు మాస్టర్ / అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ / డాక్ సేవక్:
మొత్తం ఖాళీల
సంఖ్య: 25,000 కి పైగా
అర్హత: పదో
తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం
తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు
చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి.
జీతభత్యాలు:
నెలకు బ్రాంచ్ పోస్టు మాస్టర్ పోస్టుకు రూ.12,000 నుంచి రూ.29,380, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు
మాస్టర్ కు / డాక్ సేవక్ పోస్టుకు రూ.10,000 నుంచి రూ.24,470.
వయోపరిమితి: 18 నుంచి 40 ఏళ్లు ఉండాలి.
ఎస్సీ,
ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు
మూడేళ్లు,
దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక
విధానం: అభ్యర్థులు పదోతరగతిలో సాధించిన మెరిట్ లిస్ట్ మార్కుల ఆధారంగా షార్ట్
లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు
ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్ ఉమెన్లకు
ఫీజు చెల్లింపు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.
దరఖాస్తు
విధానం: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్కు మాత్రమే దరఖాస్తు
చేసుకోవాలి. ఒక అభ్యర్థి ఒకటి కన్నా ఎక్కువ వేర్వేరు పోస్టల్ సర్కిల్లకు
దరఖాస్తులు సమర్పిస్తే అన్ని దరఖాస్తులు రద్దు చేయబడతాయి.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
రిజిస్ట్రేషన్ తేదీలు: 31.08.2026 - 19.09.2026
ఆన్లైన్
దరఖాస్తుల తేదీలు: 02.09.2026 - 21.09.2026.
దరఖాస్తు
సవరణల తేదీలు: 23.09.2026 - 24.09.2026
=====================
=====================


0 Komentar