Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Serum Institute, Bharat Biotech To Start Nasal Vaccine Trials: Centre

 


Serum Institute, Bharat Biotech To Start Nasal Vaccine Trials: Centre

దేశంలో ముక్కు ద్వారా టీకా ప్రయోగాలు.. ఆ రెండు సంస్థలకు కేంద్రం త్వరలో అనుమతి

దేశీయ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ముక్క ద్వారా ఇచ్చే వ్యాక్సిన్‌ను ఎలుకలపై ప్రయోగించగా సానుకూల ఫలితాలు వెలువడినట్టు ప్రముఖ సైన్స్ జనరల్ నేచురల్‌లో తెలిపారు. 

దేశంలో ప్రస్తుతం మూడు వ్యాక్సిన్‌‌లు వివిధ దశల్లో ఉండగా.. డిసెంబరు నాటికి ఆక్స్‌ఫర్డ్ టీకా అందుబాటులోకి వస్తుందని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. కాగా, ముక్కు ద్వారా కరోనా టీకా‌ చివరిదశ ప్రయోగాలను దేశంలో భారీస్థాయిలో నిర్వహించనున్నారు. ముక్కు ద్వారా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా, భారత్‌ బయోటెక్‌ చేపట్టనున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతులు వచ్చిన తర్వాత ఈ ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. 

కొద్దినెలల్లోనే దేశంలో ‘ఇంట్రా నాసల్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌’ అందుబాటులోకి రావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చివరి దశ ప్రయోగాల్లో 30- 40 వేల మంది వాలంటీర్ల పాల్గొనే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం.. ప్రస్తుతం కొనసాగుతున్న మూడో దశ వ్యాక్సిన్‌ ప్రయోగాలున్నీ ఇంజక్షన్‌ రూపంలోవే. ఈ నేపథ్యంలో ఇంట్రానాసల్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాలను తాము చేపట్టనున్నట్టు భారత్‌ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదిలా ఉండగా రష్యాకి చెందిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ భారత్‌లో నిర్వహించేందుకు అనుమతులు అభించినట్టు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీ శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య 75 లక్షలు దాటడంతో మహమ్మారికి ముక్కు ద్వారా వ్యాక్సిన్‌ త్వరలోనే అందుబాటులోకి రాగలదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

కాగా, ప్రస్తుతం కోవిడ్-19 బాధితులకు చికిత్సలో వాడుతున్న రెమిడిసివిర్ వంటి యాంటీ వైరల్ ఔషధాల వల్ల ఎటువంటి ప్రభావం లేదని డబ్ల్యూహెచ్ఓ అధ్యయనంలో పేర్కొంది. దీంతో ఈ ఔషధాల వాడకంపై భారత వైద్య పరిశోధన మండలి పునఃసమీక్ష నిర్వహించనుంది. 

ముక్కు ద్వారా టీకాపై భారత్ బయోటెక్.. వాషింగ్టన్ యూనివర్సిటీతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. అమెరికా, జపాన్, ఐరోపా మినహా మిగతా దేశాల్లో నాజిల్ స్ప్రే వ్యాక్సిన్ సరఫరాకు అనుమతి తీసుకుంది. కోవిడ్-19కు ముక్కు ద్వారా వ్యాక్సిన్‌పై వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇకభారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్-19 వాక్సిన్ తొలి దశ క్లినికల్ ట్రయల్స్ సెయింట్ లూయిస్ యూనివర్సిటీలో కొనసాగుతున్నాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags