Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS - EAMCET Web Options Available from Today (Oct 19) at 3pm

 


TS - EAMCET Web Options Available from Today (Oct 19) at 3pm

అందుబాటులోకి రానున్న‌ ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లు ఈ రోజు (Oct 19) మధ్యాహ్నం 3 గంటలకి


TS-ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లు, అక్టోబ‌రు 18న‌ అందుబాటులోకి తెస్తామని అధికారులు చెప్పినా.. అదీ నెరవేరలేదు. రాత్రి 10 గంటల వరకు కూడా ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభించలేదు. ఫలితంగా వేల మంది విద్యార్థులు ఎప్పుడు ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయోనని ఎదురుచూస్తూనే ఉన్నారు. నెలల తరబడి నాన్చి చివరి క్షణంలో కొత్త కోర్సులకు విద్యాశాఖ అనుమతి ఇవ్వడంతో... ఆ కోర్సులున్న కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వడం, వాటిని ఆప్షన్ల ప్రక్రియకు అనుసంధానం చేయాల్సి ఉండటంతో వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ మొదలు కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా జేఎన్‌టీయూహెచ్‌, ఓయూ, కాకతీయ విశ్వవిద్యాలయాల పరిధిలోని ప్రైవేటు కళాశాలల్లో దాదాపు 19,500 కొత్త సీట్లకు అనుమతిస్తూ అక్టోబ‌రు 17న రాత్రి 9 గంటల తర్వాత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబ‌రు 18 ఉదయం ఆ మేరకు జేఎన్‌టీయూహెచ్‌, ఓయూ, కాకతీయ వర్సిటీల అధికారులు కసరత్తు చేసి అనుబంధ ప్రక్రియ పూర్తి చేసి రాత్రికి ఎంసెట్‌ ప్రవేశాల క్యాంపు కార్యాలయానికి పంపించారు. అధికారులు కళాశాలలు, కోర్సులు, సీట్ల వారీగా వెబ్‌సైట్లో పొందుపరిచే ప్రక్రియపై కసరత్తు చేస్తున్నారు. అయినా రాత్రి వరకు ఐచ్ఛికాలు ఇచ్చుకునే ప్రక్రియ అందుబాటులోకి రాలేదు. మరోవైపు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ అక్టోబ‌రు 19  ఉదయం నుంచి అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. ముందుగా ప్రకటించిన కాలపట్టిక ప్రకారం  అక్టోబ‌రు 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లకు గడువు ఉంది. మొదటిరోజు ప్రక్రియ ప్రారంభం కానుందున గడువును కొంత పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

బీటెక్‌ సీట్లు 97,741 సీట్లు

రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం మొత్తం బీటెక్‌ సీట్లు 97,741 అందుబాటులో ఉన్నాయి. వాటిలో కన్వీనర్‌ కోటా 70 శాతం కింద 69,365 సీట్లుంటాయి. వాటిని  ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తారు. ప్రైవేట్‌ కళాశాలల్లోని సీట్లలో 70 శాతం, ప్రభుత్వ కళాశాలల్లో 100 శాతం సీట్లను కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేస్తారు. గత ఏడాది 183 కళాశాలల్లో మొత్తం 91,125 సీట్లు ఉండగా.. ఈసారి 176 కళాశాలల్లో 97,741 సీట్లున్నాయి. కళాశాలల సంఖ్య తగ్గగా.. కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వడంతో సీట్ల సంఖ్య పెరిగింది. 

TSEAMCET 2020 HLCs AVAILABLE FOR SLOT BOOKING ON 19 AND 20 OCTOBER 2020

EAMCET Website



Previous
Next Post »
0 Komentar

Google Tags